Begin typing your search above and press return to search.
పదహారు కాదు తొమ్మిదే..అదే జరిగితే సారుకు షాకే!
By: Tupaki Desk | 22 May 2019 4:51 AM GMTసార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఢిల్లీ గద్దె మీదకు ఎక్కెదెవరు? ఏపీలో పవర్లోకి వచ్చేదెవరు? అన్న రెండు క్వశ్చన్లు తప్పించి తెలుగోళ్లకు మరో ఫలితం పట్టట్లేదు. కారు.. పదహారు అంటూ గులాబీ బాస్ నినాదం ఇప్పుడెవరికి పట్టట్లేదు. తెలంగాణ ప్రాంతీయులు సైతం తమ దృష్టి మొత్తం ఏపీలో ఎవరు గెలుస్తారన్న అంశానికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం కనిపిస్తుంది.
ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలోని 17 సీట్లల్లో 16 సీట్లు తమవేనని గంటా బజాయించి మరీ చెబుతున్న కేసీఆర్ కు.. తాజా ఎన్నికల ఫలితాలు ఒకింత షాకిచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ లో తెలంగాణలో టీఆర్ ఎస్ అధిక్యత ప్రదర్శిస్తుందని చెప్పినా.. మిస్ అయిన మరో పాయింట్ ఏమంటే.. నాలుగైదు స్థానాల్లో విపక్షాలు గెలిచే అవకాశం ఉన్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి.
మోడీకి వచ్చే సీట్లు ఎన్ని? ఏపీలో జగన్ గెలిచేసీట్లు ఎన్ని? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారే తప్పించి.. కేసీఆర్ కు వచ్చే సీట్ల మీద పెద్దగా చర్చ జరగని పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ అన్ని గులాబీ పార్టీకే మేజర్ సీట్లు అని తేల్చేయటం ఒక ఎత్తు అయితే.. గెలిచేది కేసీఆరేగా అన్న మాట లైట్ అన్నట్లుగా మారింది. ఇది ఒకందుకు కేసీఆర్ కు లాభం చేకూరుతుందా? అంటే అవునని చెప్పాలి.
సాధారణంగా ఎన్నికల్లో తాము అంచనా వేసిన దాని కంటే తక్కువ సీట్లు వస్తే.. ఓటమికి సమాధానం ఎలా చెప్పాలా? అన్న సందేహంలో పార్టీలు ఉంటాయి. కేసీఆర్ అదృష్టం ఏమంటే.. తెలంగాణలో వచ్చే ఎన్నికల ఫలితాల మీద పెద్దగా ఆసక్తి లేని నేపథ్యంలో.. నాలుగైదు స్థానాల్లో కేసీఆర్ ఓడినా పెద్దగా పట్టించుకోని పరిస్థితి నెలకొంది. ఇంతకు మించి కేసీఆర్ కు ఏం కావాలి?
పదహారు సీట్లలో గెలుపు ఖాయమన్న కాన్ఫిడెన్స్ తో కేసీఆర్ ఉన్నప్పుడు.. నాలుగైదు సీట్లల్లో ఎందుకు ఓడిపోతారన్న ప్రశ్న ఒకటైతే.. అవే సీట్లు? అన్నది మరో ప్రశ్న. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సంయుక్తంగా సీటు టు సీట్ అన్నట్లు సర్వే చేసి వివరాలు వెల్లడించింది. తన సర్వే రిపోర్ట్ లో ఎవరు గెలుస్తారన్న దాని మీద కంటే.. పాపులర్ అలయెన్స్.. పాపులర్ పార్టీ.. టఫ్ ఉందా? లేదంటే.. ఎడ్జ్ ఎవరికి ఉందన్న విషయాన్ని వివరంగా వెల్లడించింది. ఈ లిస్ట్ లోకి కొన్ని నియోజకవర్గాల్లో వచ్చే ఫలితాలు ఆసక్తికరంగా ఉంటాయన్న విషయాన్ని చెప్పేసింది.
హైదరాబాద్ సీటు మజ్లిస్ ఖాతాలో వేయగా.. నాగర్ కర్నూలు టీఆర్ ఎస్ కే చెందుతుందని తేల్చేసింది. నల్గొండ కాంగ్రెస్ కు అవకాశం ఉందని.. నిజామాబాద్ లో పోటీ మాత్రం పోటాపోటీగా ఉందని.. బీజేపీ.. టీఆర్ ఎస్ రెండింటికి గెలుపు అవకాశం ఉందంటూ టీఆర్ ఎస్ అధినేత ఒక్కసారి ఉలిక్కిపడేలా చేశారు. ఎందుకంటే.. ఇక్కడి నుంచే కేసీఆర్ కుమార్తె కవిత బరిలో ఉన్నారు.
పెద్దపల్లి.. సికింద్రాబాద్.. వరంగల్.. జహీరాబాద్ నాలుగు స్థానాల్లో టీఆర్ ఎస్ గెలుపు మీద ఢోకా లేదని తేల్చింది ఆసక్తికరంగా అదిలాబాద్ లో బీజేపీ.. కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని.. టీఆర్ ఎస్ సోదిలో కూడా లేదని చెప్పిన ఫలితం ఇంట్రెస్టింగ్ ఉంది. భువనగిరిలో కాంగ్రెస్.. టీఆర్ ఎస్ మధ్య పోటీ హోరాహోరీగా ఉందని.. ఏ పార్టీ అయినా గెలిచే వీలుందన్న మాటను చెప్పాలి.
చేవెళ్లలో కాంగ్రెస్.. టీఆర్ ఎస్ మధ్య నడుస్తుందని.. కాంగ్రెస్ వైపు ఒకింత మొగ్గటం కనిపిస్తుంది. కరీంనగర్ బీజేపీ వైపు క్లియర్ కట్ మెజార్టీ వస్తుందని తేల్చేయటం ఒక విశేషమైతే.. ఖమ్మం టీఆర్ ఎస్ ఖాతాలోనే పడుతుందని పేర్కొంది. మహబూబాబాద్ లో కాంగ్రెస్ టీఆర్ ఎస్ మధ్య పోటాపోటీ నడుస్తుందని.. రెండింటిలో ఏ పార్టీ అయినా గెలిచే వీలుందని చెబుతున్నారు. ఇక.. మహబూబ్ నగర్.. మల్కాజిగిరి.. మెదక్ నియోజకవర్గాల్లో టీఆర్ ఎస్ గెలుపుకు ఢోకా లేదని పేర్కొన్నారు. మరీ.. ఫలితాల్లో వాస్తవరూపం దాల్చే అవకాశం ఎంతన్న విషయం మరో రోజులో తేలిపోనుంది.