Begin typing your search above and press return to search.

గులాబీ బాస్ కి తలనొప్పిని గా మారిన ఆ ఎమ్మెల్యే ఎవరు?

By:  Tupaki Desk   |   5 Dec 2019 11:57 AM GMT
గులాబీ బాస్ కి తలనొప్పిని గా మారిన ఆ ఎమ్మెల్యే ఎవరు?
X
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ..ఆ నిర్ణయం ఆరు నూరైనా ..నూరు ఆరైనా కూడా అమలు చేయాల్సిందే. దానిపై అయన వెనుకడుగు వేయరు. ఇది ఇప్పటికే ఎన్నో సార్లు రుజువైంది. కాబట్టి ..గులాబీ నేతలు కూడా అయన నిర్ణయాన్ని పాటిస్తూ ఉంటారు. అలాంటి ఈ బాస్ కే ఒక ఎమ్మెల్యే పెద్ద తలనొప్పిగా మారిపోయారు అని ప్రచారం జరుగుతుంది. ఆ ఎమ్మెల్యే వ్యవహార తీరుతో ..ఇప్పుడు పార్టీకి తలనొప్పిగా మారాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనితో అధికార పార్టీ ఎమ్మెల్యే పై అయన నియోజకవర్గంలోనే కేసు నమోదు అయ్యింది.

సాధారణంగా రూలింగ్ పార్టీలోని ..ఎమ్మెల్యే పై కేసు నమోదు చేయడం ..అది కూడా అదే నియోజకవర్గంలో కేసు నమోదు చేయడం తో ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇది ఎవరైనా చేసిన పనా లేక ..ఆ ఎమ్మెల్యే వ్యవహార తీరు నచ్చక ..పార్టీ అధిష్టానమే ఇలా చేస్తుందా అని చర్చించుకుంటున్నారు. గులాబీ పార్టీ ఎమ్మెల్యే కి ఈ పరిస్థితి రావడానికి ముఖ్య కారణం ..ఆ ఎమ్మెల్యే వెనుక ఉన్న షాడో ఎమ్మెల్యే అని తెలుస్తుంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఏకైక మైనార్టీ ఎమ్మెల్యేపై జరుగుతున్న తాజా చర్చ ఇది? పార్టీకి ఆయన దూరం అవుతున్నారా.. పార్టీ ఆయన్ను దూరం పెడుతోందా...? తాజా పరిణామాలు దేనికి సంకేతం..?

కొంత కాలంగా అసంతృప్తితో రగిలిపోతున్న ఆయన కొద్ది రోజుల క్రితం అదిష్ఠానంపై స్వరం పెంచి బీజేపీ ఎంపీతో ములాఖత్ అయ్యారు. ఆ వివాదం సద్దుమణగకముందే తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. సదరు ఎమ్మెల్యే పై ఏకంగా ఆయన సొంత నియోజకవర్గంలో పోలీస్ కేసు నమోదు కావడం రాష్ట్ర స్దాయిలో సంచలనం సృష్టించిందట. సాక్ష్యాధారాలు లేకుంటే సామాన్యుల విషయంలోనే ఆచితూచి కేసు పెట్టే పోలీసులు - ఏకంగా ఎమ్మెల్యే పైనే కేసు పెట్టారు అంటే దాని వెనుక ఉన్న అసలు విష్యం తెలియక ఆ ఎమ్మెల్యే మధన పడిపోతున్నాడట.

బోధన్ మండలం ఆచన్‌ పల్లి రహదారిపై రెండు రోజుల క్రితం అర్ధరాత్రి ఓ గొడవ జరిగింది. ఎమ్మెల్యే షకీల్ ఆయన అనుచరులు ఇసుక మాముళ్ల కోసం తనపై దాడి చేశారంటూ ముగ్గురు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం అధిష్ఠానం దృష్టికి వెళ్లడం ఆఘమేఘాలపై ఎమ్మెల్యే షకీల్ తో పాటు ఆయన సోదరుడు సోహైల్ - మరో ఏడుగురిపై కేసు కావడంపై ఆయన జీర్ణించుకోలేకపోతున్నారట.

అయితే, ఎమ్మెల్యే షకీల్ పై అధిష్ఠానం కొద్ది రోజులుగా గుర్రుగా ఉందట. ఆయన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ను కలవడం - పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం - బీజేపీ వైపు వెళ్తారనే ప్రచారంతో ఆయన వ్యవహార శైలీపై ఓ కన్నేసిందనే టాక్ నడుస్తోంది. దీనికి తోడు నియోజకవర్గంలో ఇసుక దందాలో ఎమ్మెల్యే అనుచరుల జోక్యం పెరిగిపోవడం కూడా అధిష్ఠానానికి తలనొప్పిగా మారిందనే చర్చ జరుగుతోంది. ఆయన సోదరుడు షాడో ఎమ్మెల్యేగా ప్రతీ పనిలో జోక్యం చేసుకోవడం కూడా ఆయనకి మైనస్ గా మారింది. ఈ వివాదాలు ఆయనకు చెక్ పెట్టేలా చేస్తున్నాయనే ప్రచారం నడుస్తోంది. ఈ వివాదానికి గులాబీ బాస్ ఏ విధంగా చెక్ పెడతారో చూడాలి ..