Begin typing your search above and press return to search.
దశాబ్దాలు గడిచినా.. ఆంధ్రోళ్లు అనేది మీరే సారూ!
By: Tupaki Desk | 17 Oct 2018 5:10 AM GMTఇదెక్కడ గోలరా బాబు.. అన్నట్లుగా ఉంది ఆంధ్రోళ్లు.. అదేనండి తెలంగాణ ఆంధ్రోళ్ల పరిస్థితి. తమను తాము తెలంగాణ వారిగా ఫీలవుతున్నా.. నో.. నో.. నువ్వు ఆంధ్రోడివి అంటూ అదే పనిగా కెలికి కెలికి మరీ గుర్తు చేసే అలవాటు శ్రీమాన్ కేసీఆర్ లోనే కనిపిస్తుంటుంది. ఆయన.. ఆయన పార్టీ నేతలు తప్పించి ఆంధ్రోళ్లు అంటూ వెలెత్తి చూపించేటోళ్లు.. గుర్తు చేసేటోళ్లు అస్సలు కనిపించరు.
ఒకవైపు తానే చూస్తూ.. మరోవైపు.. మీరెందుకు ఇంకా ఆంధ్రా అనుకుంటున్నారు? అలా ఎందుకు అనుకోవాలి? అంటూ ప్రశ్నలు వేస్తున్న కేసీఆర్ తీరు చూస్తే.. ఆయన తెలివికి జోహార్లు అనాల్సిందే. హైదరాబాద్‌లోని ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే కాదు..తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోని ఆంధ్రా మూలాలు ఉన్న వారిని వేలెత్తి.. మీరు ఆంధ్రోళ్లు అన్న మాట గులాబీ నేతలు తప్పించి.. మరే పార్టీ నేతలు అనరన్న విషయాన్ని మర్చిపోకూడదు.
ఎవరిదాకానో ఎందుకు.. ఉమ్మడి రాష్ట్ర ఆఖరు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంగతే తీసుకుంటే.. ఆయన్ను పక్కా హైదరాబాదీగా చెప్పాలి. ఆయన చదువు మొదలు.. ఆయన జీవితం మొత్తం హైదరాబాద్‌తోనే ముడిపడి ఉంది. కానీ.. ఆయన్ను సీమాంధ్రుడన్న ముద్ర వేశారే కానీ.. హైదరాబాదీ అన్నది లేదు. ఇంతకీ ఆ ముద్ర వేసిన మాష్టారు ఎవరంటే కేసీఆరే.
ఈ రోజుకు కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణేతరుడిగా చూస్తుండే కేసీఆర్.. ఇప్పుడు ఆంధ్రోళ్లు అని మీరెందుకు అనుకుంటారు. మీరంతా తెలంగాణవారే అన్న మాట అంటుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. ఓవైపు వేలెత్తి చూపిస్తూనే.. మరోవైపు మరో వేలితో మీరు ఆంధ్రోళ్లు అని ఎందుకు అనుకుంటారంటూ కేసీఆర్ చేసే వ్యాఖ్యల్లో మర్మం ఒక పట్టాన అర్థం కానిది.
ఆంధ్రా మీద వ్యతిరేక సెంటిమెంట్ తో రాజకీయ ప్రయోజనాన్ని పొందాలని భావించే కేసీఆర్.. తెలంగాణకు వ్యతిరేకంగా కిరణ్ వ్యవహరించారంటూ ముద్ర వేయటమే కాదు.. ఆ విషయాన్ని తనదైన శైలిలో గ్లోరిఫై చేయటం కనిపిస్తుంటుంది.
తెలంగాణకు నయా పైసా ఇవ్వను.. ఏం చేసుకుంటావో చేసుకోపో అని తెలంగాణను ఉద్దేశించి చెప్పినట్లుగా కేసీఆర్ వీరావేశంతో వ్యాఖ్యానిస్తుంటారు. కానీ.. కిరణ్ నోటి నుంచి ఆ మాట రావటానికి ముందు.. టీఆర్ఎస్ నేతలతో ఆయనకు జరిగిన సంవాదం.. వారు చేసిన వ్యాఖ్యల్ని మాత్రం మాట వరసకు కూడా కేసీఆర్ ప్రస్తావించరు.
కిరణ్ కుమార్ రెడ్డి లాంటి పక్కా హైదరాబాదీనే తెలంగాణ వ్యక్తి కాదన్నట్లుగా చెప్పే కేసీఆర్.. ఇప్పుడు ఆంధ్రా మూలాలు ఉన్న వారిని.. మిమ్మల్నిమీరు తెలంగాణవాదులుగా ఎందుకు అనుకోరంటూ ప్రశ్నించటం భలే సిత్రంగా ఉంటుందని చెప్పాలి. ఎన్నికల మేనిఫేస్టోకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఒకప్పుడు ఆంధ్రా.. తెలంగాణ అన్న చర్చ వచ్చినప్పుడు సెటిలర్ల విషయంలో తాను ఎలా వాదించేవాడో చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు కేసీఆర్.
"ఒకప్పుడు ఇలాంటి చర్చే వస్తే ‘వై ఆర్‌యూ అన్ నెసెసరిలీ క్లెయిమింగ్ యూ ఆర్ ఆంధ్రా..? క్లెయిమ్ యువర్ సెల్ఫ్ తెలంగాణ’ అని ఇంగ్లిషలో చెప్పా. ఇక్కడున్న ఆంధ్రోళ్లంతా మావాళ్లే. ఎన్నిసార్లు చెప్పాలి?’’ అంటూ కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలకు నవ్వాలో.. ఏడవాలో అర్థం కాని పరిస్థితి. ఆంధ్రోళ్లు. . ఆంధ్రోళ్లు అంటూ అదే పనిగా అనే కేసీఆర్.. ఇప్పుడేమో అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేయటం చూస్తే.. తెలంగాణలో ఉన్నోళ్లంతా తెలంగాణ వారే అన్న భావన కలగాలంటే.. కేసీఆర్ నోట్లో నుంచి ఆంధ్రోళ్లన్న మాట రాకుండా ఉంటే చాలు. ఆ విషయం కేసీఆర్ కు తెలియంది కాదు. కానీ.. తన రాజకీయ ప్రయోజనం కోసం ఇలా ట్విస్టింగ్ వ్యాఖ్యలు చేయటం ఆయనకు మాత్రమే సాధ్యం కాబట్టి సార్.. ప్లీజ్ కొన్నేళ్లు మీ నోట్లో నుంచి ఆంధ్రోళ్లు అన్న మాట రాకుంటే చాలు.. అందరూ తెలంగాణవాళ్లు అయిపోతారు.