Begin typing your search above and press return to search.
దేవుడి కోసం ‘‘దేవుడే’’ పూజలు చేయుడేంటి?
By: Tupaki Desk | 27 Dec 2015 5:07 AM GMTఎవరు అవునన్నా.. కాదన్నా తెలంగాణ రాష్ట్రానికి రాజు కేసీఆరే. ప్రజాస్వామ్య భారతంలో ముఖ్యమంత్రిగా అభివర్ణిస్తున్నా.. తెలంగాణ అడ్డాకు మకుటం లేని మహరాజు కేసీఆరే. మరి.. కిరీటం లేని రాజు అంటే.. కాస్త అటూఇటూగా దేవుడితో సమానం. కాదన్న అనుమానం వస్తే.. ఆయన దగ్గరకు సాయం కోసం వెళ్లే వారిని.. ఆయన ద్వారా సాయం పొందిన వారిని కదిపించి చూడండి. కేసీఆర్ దేవుడని.. ఆయన నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశ్వీరదిస్తారు.
సాయం పొందినోళ్లకు కేసీఆర్ దేవుడిగా కనిపించేటప్పుడు.. ప్రజలకు కూడా ఆయన దేవుడే కాక మరేంటి. రాజరికం కానీ ప్రజాస్వామ్యం కానీ.. పాలించే ప్రభువే ప్రజలకు దైవం. ఆయనే కంటికి కనిపించే భగవంతుడు. కంటికి కనిపించని దేవుడు వరాలు ఇస్తాడో లేదో తెలీదు. కానీ.. కంటి ముందు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ తలుచుకోవాలే కానీ కొండ మీద కోతి కూడా దిగిరాదా?
తన దగ్గర ఉన్న అధికారంతో ఇప్పటికే ఎన్నో మేజిక్ లు చేసిన ఆయన.. జనాల ఈతి బాధల్ని తప్పించే మొనగాడనటంలో సందేహమే లేదు. ఆయనలో ఆ సత్తా ఉందా? అన్న సందేహపడే వారందరికి యాగాన్ని ‘వ్యక్తిగత హోదా’లో నిర్వహించి సమాధానం చెప్పేశారు. వ్యక్తిగతంగా గడిచిన నాలుగు రోజుల్లో లక్షలాది మందికి సింగిల్ హ్యాండ్ తో భోజనాలు పెట్టించటం దగ్గర నుంచి.. యాగాన్ని ఎంత గ్రాండ్ గా చేస్తున్నారో తెలిసిందే. దేశంలో వేలాది కోట్ల ఆస్తులు ఉన్నోళ్లు చాలామందే ఉన్నారు. దేవుడంటే భయం.. భక్తి ఉన్న వారు కోట్లల్లో ఉన్నారు. కానీ.. వారెవరికీ సాధ్యం కానిది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే సాధ్యమైన అయుత చండీయాగం నిర్వహించిన తీరు చూస్తే.. ఆయన కనిపించే దేవుడు కాదని ఎవరు మాత్రం అనగలరు?
ఒక ముఖ్యమంత్రి మనసు పెట్టాలే కానీ.. ఎన్ని అద్భుతాలు చేయొచ్చో అయుత చండీయాగం తెలియజెప్పింది. రోడ్డు మూలన తన తఢాఖా చూపించే ‘పోలీసు’ యాగం దగ్గర ఎంత మంచిగా పని చేశాడు. యాగం దర్శనం కోసం తపిస్తున్న వారు.. తోపులాటలో తొందరపడితే.. అతృతను అర్థం చేసుకొని సముదాయించారే కానీ.. అవాకులు చవాకులు పేల్లేదు. తమ డ్యూటీని ఎంతో బాధ్యతగా నిర్వర్తించిన వారు.. ఫ్రెండ్లీ పోలింగ్ అంటే ఏమిటో యాగం నాలుగు రోజుల్లో చేతల్లో చేసి చూపించారు.
సర్కారీ ఆపీసుల కాడ చిన్న పనికే ఆగమాగం చేసే అధికారులు.. కుక్కిన పేనులా ఎంతగానో కష్టపడ్డారు. ఇక.. తామెంతో మొనగాళ్లుగా చెప్పుకునే నేతలెంతో మంది.. కార్యకర్తల్లా ఒళ్లు వంచి పని చేయటం ఏమిటి? ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆ పూజలేంది? అంత మంది సాములోరేంటి? ఆ భోజనాలేంది? ఆ కత.. కార్ఖానా ఏంది? భారీగా సాగుతున్న ఈ యవ్వారాలు చూస్తే.. మడిసన్నోడికి సాధ్యమయ్యేనా ఇలాంటివన్నీ?
వ్యక్తిగత హోదాలో గతంలోనూ యాగాలు చేయటం కేసీఆర్ కు కొత్తేం కాదు. కానీ.. ప్రజా రాజు (ముఖ్యమంత్రి) అయ్యాక చేసిన ఈ యాగానికి.. గతంలో చేసిన యాగానికి వ్యత్యాసం ఎంతన్నది చూసే ప్రతిఒక్కళ్లకు తెలిసిపోయింది. యాగం జరుగుతున్న తీరును చూసిన తర్వాత ప్రజాస్వామ్య భారతంలో ముఖ్యమంత్రిని రాజుతో సమానమని ఎందుకంటారో చాలామందికి తెలిసిపోయింది. అన్ని బాగానే అర్థమవుతున్నా ఒక్క విషయమే అర్థం కావట్ల. కంటికి కనిపించే దైవం.. కంటికి కనిపించని దైవాన్ని పూజలు చేయడేంటి? ఇదెక్కడి లాజిక్కు? అపరిమితమైన అధికారాన్ని చెలాయించే కేసీఆర్ లాంటి వారు.. తమ వరకు తాము కంటికి కనిపించని ఏదో శక్తి గురించి ఇంత భక్తిగా పూజలు చేయుడేంటో..? ఇన్ని పూజలు చేసే కన్నా.. పేదోళ్లను వెంటాడి.. వేధించే ఏదో ఒక కష్టమ్మీదా ఇంతే శ్రద్ధగా పని చేస్తే.. కనిపించని దైవం కరుణించదా? అందుకోసం ఇంత పెద్ద ఎత్తున ‘‘వ్యక్తిగతం’’గా పూజలు చేయాల్సిన అవసరం ఉంటుందా?