Begin typing your search above and press return to search.
విభజన చట్టం ఎయిమ్స్ ఊసు ఎక్కడ ఉన్నదో?
By: Tupaki Desk | 20 Jan 2015 7:30 PM GMTతెలంగాణలో తమ పార్టీని మరింతగా బలోపేతం చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్న కొద్దీ.. ఆ పార్టీని తెలంగాణ వ్యతిరేక పార్టీగా చిత్రీకరించి వారికి ప్రజల్లో ఏర్పడగల సానుకూల అభిప్రాయాన్ని భ్రష్టు పట్టించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త వ్యూహాలను అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారీ హామీలను కురిపించేసి.. ఆ పిమ్మట ఆయా హామీలకు కేంద్రానికి ముడిపెట్టి.. వారు కనికరించడం లేదంటూ.. భాజపా మీద బురద చల్లడానికి ఆయన వ్యూహరచన చేస్తున్నట్లున్నది. ఇదివరకే ఇలాంటి అనుమానాలు కొన్ని పథకాల విషయంలో కలుగుతుండగా.. తాజాగా.. బీబీనగర్‌లో ఎయిమ్స్ ఆస్పత్రి ఏర్పాటుచేస్తామంటూ కేసీఆర్ ఇస్తున్న హామీ కూడా ఇదే కోవలోకి చెందుతుంది.
మంగళవారం నాడు బీబీ నగర్ నిమ్స్ ఆస్పత్రిని సందర్శించి.. దీనిని ఎయిమ్స్ గా మార్చేస్తాం అంటూ కేసీఆర్ చాలా ఘనమైన హామీ ఇచ్చారు. తెలంగాణకు ఎయిమ్స్ కేటాయిస్తున్నట్లుగా విభజన చట్టంలోనే ఉన్నదని ఆయన సెలవిచ్చారు. దానికి కొత్తస్థలం బదులుగా.. ఇక్కడ పెడతాం అన్నారు. అయితే నిపుణులు మాత్రం.. విభజన చట్టంలో ఎక్కడా తెలంగాణకు ఒక ఎయిమ్స్ ఇస్తాంఅనే హామీ లేదని.. కేసీఆర్ చాలా తెలివిగా... కేంద్రం చేయలేని పనిని వారికి ఆపాదించేస్తున్నారని విశ్లేషిస్తున్నారు.
విభజన చట్టంలో ఎక్కడా తెలంగాణకు ఎయిమ్స్ గురించి లేదు సరికదా... ఎన్నికల తర్వాత.. కేసీఆర్ కూతురు కవిత సారథ్యంలో తెరాస ఎంపీలు కేంద్రమంత్రులను కలిసి తెలంగాణకు ఎయిమ్స్ 'తరహా' ఆస్పత్రి ఒకటి మంజూరు చేయాలని కోరారు. దానికే పెద్దగా సానుకూల స్పందన రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే వైద్యసదుపాయాల పరంగా శాచురేటెడ్ పరిస్థితి ఉన్నదని కేంద్రమంత్రులు.. ఈ ఎంపీలతో వ్యాఖ్యానించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పట్లో ఎవ్వరూ కూడా.. విభజన చట్టం మేరకు తమకు ఇవ్వాలని కేంద్రమంత్రులతో చెప్పలేదు. తీరా కేసీఆర్ ఇప్పుడు మాత్రం.. చట్టంలోనే తమకు ఎయిమ్స్ కేటాయింపు ఉన్నదని అంటున్నారు. ఇదంతా కేవలం.. కేంద్రాన్ని ఇరుకున పెట్టడానికి మాత్రమే అని కూడా కొందరు వాదిస్తున్నారు. మరి ఇలాంటి వ్యూహాల ద్వారా కేసీఆర్ ఎంత మేర ప్రయోజనం సాధించగలరో చూడాలి.