Begin typing your search above and press return to search.
టీడీపీతో కలిస్తే కేసీఆర్ వదలడు.. అదే బీజేపీ భయం
By: Tupaki Desk | 14 Jan 2023 3:30 PM GMT2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ చేసిన పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? ఆంధ్రా నాటి సీఎం చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం.. అదే కాంగ్రెస్ కొంప ముంచిది. తెలంగాణలో ఇంకా ఆంధ్రా పెత్తనం అవసరమా? అని కేసీఆర్ నినదించడం.. జనాలు కాంగ్రెస్ కు ఓటు వేయకపోవడం.. టీఆర్ఎస్ గెలవడం జరిగిపోయింది.
ఇప్పుడు కూడా బీజేపీ ఊగిసలాడుతోంది. తమకు బలం లేని ఖమ్మం, హైదరాబాద్, దక్షిణ తెలంగాణలో టీడీపీని పోటీచేయించి పొత్తు పెట్టుకోవాలని సాయం తీసుకోవాలని చూస్తోంది. కానీ 2018 లో కాంగ్రెస్ ను దెబ్బతీసినట్టే తమను కేసీఆర్ దెబ్బకొడుతాడని భయపడుతోంది. అందుకే టీడీపీతో పొత్తు లేదని తాజాగా బీజేపీ తెలంగాణఇన్చార్జి తరుణ్ చుగ్ స్వయంగా క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.
అందుకే కేసీఆర్ విషయంలో బీజేపీ భయపడుతోంది. తెలంగాణలో గెలుపు దగ్గరైన వేళ ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో కలవకూడదని డిసైడ్ అయ్యింది. దీన్ని కేసీఆర్ కు ఆయుధంగా మలచవద్దని యోచిస్తోంది. గురువారం ఢిల్లీలో మాట్లాడిన తరుణ్ చుగ్ ఈ మేరకు టీడీపీతో పొత్తు అంశాన్ని బీజేపీ ఆలోచిస్తోందని స్పష్టతనిచ్చారు. ఈ అంశం పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు పెంచింది. ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించింది. త్వరలోనే నిజామాబాద్ లోనూ సభ పెడుతామని ప్రకటించారు. అదే సమయంలో అసలు టీడీపీ ఇలా తెలంగాణలో మళ్లీ బల ప్రదర్శన చేయడానికి కారణం.. బీజేపీ పొత్తుల కోసం ప్రయత్నించడమేనని ఇతర పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.2014 ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ-బీజేపీ కలిసి పోటీచేశాయి. బీజేపీ ఐదు, టీడీపీ 14 సీట్లలో గెలిచాయి. ఆ తర్వాత రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. తెలంగాణలో టీడీపీ పూర్తిగా బలహీనపడింది. బీజేపీ బలం పెరిగింది. అయితే తెలంగాణ వ్యాప్తంగా లేదు. అందుకే ఈ రెండు పార్టీలు కలిస్తే గెలుపు గ్యారెంటీ.. కానీ కేసీఆర్ ఆంధ్రా వాదం తెచ్చి దెబ్బతీస్తాడని బీజేపీ భయపడుతోంది.టీడీపీతో పొత్తును ఖండిస్తుంది.
అయితే ప్రత్యక్షంగానైనా.. పరోక్షంగానైనా తెలంగాణలో బీజేపీకి సహాయ సహకారాలు అందించేందుకు బీజేపీ, జనసేన రెడీగా ఉన్నాయి. ఈ మూడు పార్టీలు బీజేపీని తెలంగాణలో గెలిపించేందుకు కలిసి సాగాలని ప్లాన్ చేసినట్టు సమాచారం.ఇప్పటికే ఏపీలో టీడీపీ+జనసేన పొత్తు ఖాయమన్న సూచనలు కనిపిస్తున్నాయి. అయితే బీజేపీని కూడా ఇందులో కలుపుకుపోవాలని పవన్ భావిస్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదంటే ఇది తప్ప మార్గం లేదని భావిస్తున్నారు. అందుకే ముందుగా జరిగే తెలంగాణ అసెంబ్లీ ఈ ఎన్నికల్లో ఈ ముగ్గురు కూటమి కలిసి సాగాలా? లేక విడివిడిగానే అవగాహనతో ముందుకెళ్లాలా? అని ఆలోచిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.