Begin typing your search above and press return to search.
కేసీఆర్.. ఒక మానవీయ కోణం
By: Tupaki Desk | 3 Jan 2016 11:01 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం కేబినెట్ సమావేశాల సందర్భంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో లబ్ధి పొందడానికే ఆయన ఆ నిర్ణయాలు తీసుకున్నారనే విమర్శలు కొంతమంది చేస్తున్నా.. అసలు అటువంటి నిర్ణయాలు చేయడానికి మానవీయత ఉండాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఉదాహరణకు ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు కాలుష్య అలవెన్స్ ఇవ్వాలని, వారికి మూల వేతనంలో 30 శాతం పెంచాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ నిర్ణయంపై కేవలం పోలీసు వర్గాల్లోనేకాదు.. ఇతర వర్గాల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది. ట్రాపిక్ కానిస్టేబుళ్ల నిజంగానే కాలుష్య కాసారంలో మునిగి ఉంటున్నారు. వారికి ఎక్కువగా ఊపిరితిత్తులు, కేన్సర్లు వంటివి వస్తున్నాయని ఇటీవల జరిగిన సర్వేలో కూడా తెలింది. అయినా వారికి జీతాలు తక్కువే. కాలుష్యాన్ని తప్పించుకోవడానికి వారికి ఎటువంటి రక్షణ కూడా లేదు. వారికి అలవెన్స్ ఇవ్వడం నిజంగా అభినందనీయం.
వారం రోజుల్లో కారుణ్య నియామకాలను పూర్తి చేయాలన్న నిర్ణయంపైనా హర్షం వ్యక్తమవుతోంది. నిజానికి ఎవరైనా చనిపోతే వారి ఇంట్లోని అర్హులకు ఉద్యోగాలు ఇవ్వడానికి పెద్దఎత్తున పైరవీలు, అవినీతి జరుగుతోంది. ఏళ్ల తరబడి జాప్యం అనివార్యం అవుతోంది. కానీ వారం రోజుల్లోనే నియామకాలు చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం విశేషం. అలాగే, పదవీ విరమణ చేసిన వారికి ఒకేసారి ప్రయోజనాలు అందించాలని నిర్ణయించడమే కాకుండా వారిని ప్రభుత్వ వాహనంలో సగౌరవంగా ఇంటికి పంపించాలనే నిర్ణయం ప్రభుత్వ, ఉద్యోగ వర్గాల గుండె తలుపులను తట్టింది.
సెలూన్లకు వాడే విద్యుత్తును వాణిజ్యం నుంచి గృహ వినియోగానికి మళ్లించడంపైనా కేసీఆర్ పూర్తిస్థాయిలో మార్కులు కొట్టేశారని అంటున్నారు.