Begin typing your search above and press return to search.
ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ కీలక ప్రకటన
By: Tupaki Desk | 15 Nov 2022 12:01 PM GMTతెలంగాణలో ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ పీచేముడ్ అన్నారు. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలను ఎదుర్కోవడానికి కేసీఆర్ భయపడుతున్నారు. బీజేపీతో ముందస్తు ఫైట్ కు వెనక్కి తగ్గాడు. ముందస్తు ఎన్నికలు అంటూ వస్తున్న ఊహాగానాలకు కేసీఆర్ తెర దించాడు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవని..
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేవంలో స్పష్టం చేశారు. నేటి నుంచి ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలో ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికలకు గట్టిగా ఏడాది సమయం మాత్రమే ఉందని.. అందరూ కష్టపడాలని సూచించారు. బీజేపీతో ఇక యుద్ధమేనని తేల్చిచెప్పారు.
ఇటీవల కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికల గెలుపుతో బీజేపీని దెబ్బకొట్టాలంటే ఇదే సరైన సమయం అని.. బీజేపీ, కాంగ్రెస్ సర్దుకోకముందే ఎన్నికలకు వెళ్లి దెబ్బతీయాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు అసెంబ్లీని రద్దు చేసినా వృథా అని కేసీఆర్ డిసైడ్ అయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 డిసెంబర్ లో జరుగుతాయి. దానికంటే ముందే ముందుగా ఎన్నికలకు వెళ్లడానికి కేసీఆర్ రెడీ అయినట్టు ప్రచారం సాగింది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే పలు సర్వేలు చేయించుకున్న కేసీఆర్.. ఇప్పుడు వెనక్కి వెళ్లారు.
2023 డిసెంబర్ లో తెలంగాణ ఎన్నికలు జరుగుతాయి. అంటే ఇప్పటికీ సంవత్సరం టైం ఉంది. ఇప్పుడు అసెంబ్లీని రద్దు చేస్తే 6 నెలలలోపు ఎన్నికలు ఉంటాయి. అంటే కేవలం 6 నెలల ముందుగానే కేసీఆర్ ఎన్నికలు కోరుకుంటారు. అందుకే 6 నెలలతో పోయేది ఏంటని భావించిన కేసీఆర్ అనవసరంగా ముందస్తుకు వెళ్లడం కంటే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. 6 నెలల కోసం మళ్లీ ముందస్తుకు వెళ్లడం వృథా అని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.