Begin typing your search above and press return to search.
'టీ' ఎన్‌కౌంటర్ మీద విచారణ దేనికి సందేశం?
By: Tupaki Desk | 13 April 2015 4:27 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు కొద్ది గంటల తేడాతో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లు ఎంత సంచలనాన్ని సృష్టించాయో తెలిసిందే. శేషాచల అడవుల్లో ఏపీ పోలీసులు.. అటవీ అధికారుల దెబ్బకు 20 మంది ఎర్రచందనం దొంగలు మృత్యువాత పడితే.. కోర్టులో విచారణ కోసం వరంగల్ జైలు నుంచి తరలిస్తున్న క్రమంలో పారిపోయేందుకు ప్రయత్నించిన ఉగ్రవాది వికారుద్దీన్‌తో పాటు మొత్తంగా ఐదుగురిని ఎన్‌కౌంటర్ చేసేయటం తెలిసిందే.
శేషాచలం ఎన్‌కౌంటర్‌తో పోలిస్తే.. ఉగ్రవాది వికారుద్దీన్ గ్యాంగ్‌పై జరిగిన ఎన్‌కౌంటర్‌పై విమర్శలు తక్కువగానే వినిపించాయి. మజ్లిస్ నేతలు.. ముస్లిం మత పెద్దలతో పాటు.. తెలంగాణ కాంగ్రెస్ ఈ ఎన్‌కౌంటర్‌ను ప్రశ్నించింది.
వికార్‌ని ఉద్దేశ్యపూర్వకంగానే హతమార్చినట్లు అతడి తండ్రి ఆరోపిస్తున్నారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన ముస్లిం మత పెద్దలు.. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీలు ఎన్‌కౌంటర్ మీద విచారణ జరపాలని డిమాండ్ చేశారు. త్వరలో నిర్ణయం తీసుకుంటానని చెప్పిన కేసీఆర్.. అందుకు తగ్గట్లే నిర్ణయం తీసుకున్నారు. ఎన్‌కౌంటర్‌పై విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
వికారుద్దీన్ ఎన్‌కౌంటర్ సందర్భంగా కేసీఆర్ సర్కారు పని తీరుపై సాగిన విశ్లేషణకు భిన్నంగా.. ఈ ఘటనపై విచారణను ఆదేశించటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చనిపోయింది ఉగ్రవాది అయినప్పడు.. ఆ ఏన్‌కౌంటర్‌పై విచారణకు ఆదేశాలు జారీ చేయటం ద్వారా పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసినట్లుగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల కాలంలో కొద్దిరోజుల వ్యవధిలో సిమీ ఉగ్రవాదుల కారణంగా ముగ్గురు పోలీసులు చనిపోవటం తెలిసిందే. ఉగ్రవాద ఆరోపణలు ఉన్న వారి ఎన్‌కౌంటర్‌పై విచారణకు ఆదేశించటం ద్వారా మజ్లిస్‌కు కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇవ్వటంతో పాటు.. మజ్లిస్ ఒత్తిడికి సారు తలగ్గారన్న విమర్శ వినిపిస్తోంది. అదేసమయంలో పోలీసులపై సందేహాలు వ్యక్తమయ్యేలా.. విమర్శలు పెరిగేలా తాజా ఆదేశాలు అభిప్రాయపడేలా చేస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.