Begin typing your search above and press return to search.
కేటీఆర్ ను కాదని కేసీఆర్ రంగంలోకి దిగారా?
By: Tupaki Desk | 10 Feb 2016 1:09 PM GMTగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా టీఆర్ ఎస్ గెలుపు బాధ్యతలను తన కుమారుడు,మంత్రి కేటీఆర్ కు అప్పజెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ చిన్న బాధ్యత నుంచి మాత్రం కేటీఆర్ ను తప్పించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బ్రహ్మండమైన విజయం దక్కేందుకు వ్యూహాలు పన్ని అమలు చేసే బాధ్యతను తనయుడికి అప్పగించిన నేపథ్యంలో గ్రేటర్ కళ్లెం మాత్రం తన చేతుల్లో ఉంచుకునేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆలోచనను మేయర్ - డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా అమల్లో పెట్టనున్నారు.
జీహెచ్ ఎంసీ మేయర్ ఎన్నిక రేపు జరగనున్న నేపథ్యంలో అధికార వర్గాలు అంతా రెడీ అయ్యాయి. కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లతో మేయర్ - డిప్యూటీ మేయర్ ను ఎన్నికోనున్నారు. ఎక్స్ అఫిషియో సభ్యులైన మంత్రి - ఎంపీ - ఎమ్మెల్యే - ఎమ్మెల్సీలకు ఓటింగ్ విధానంపై అవగాహన ఉంది. కానీ కొత్తగా ఎంపికైన కార్పొరేటర్లకు ఈ విషయంలో పూర్తి అవగాహన ఉండకపోవచ్చునని కేసీఆర్ భావించారు. దీంతో కొత్త కార్పొరేటర్లకు శిక్షణ ఇచ్చేందుకు రెడీ అయిపోయి షెడ్యూల్ ఖరారు చేశారు. ఒక్క శిక్షణకే పరిమితం అవకుండా మరిన్ని అంశాలను వారికి వివరించనున్నారు.
గురువారం ఉదయం ఎనిమిది గంటలకు గ్రేటర్ కార్పొరేట్లతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. మేయర్ - డిప్యూటీ మేయర్ ఓటింగ్ విధానంపై కార్పొరేట్లకు వివరించనున్నారు. ఈ క్రమంలో సిటీలో పరిపాలనపై కూడా కార్పొరేటర్లకు మరోమారు దిశానిర్ధేశం చేయనున్నారు. ఇదిలాఉండగా ఈ శిక్షణ సమయంలోనే మేయర్- డిప్యూటీ మేయర్ అభ్యర్థులపై అధికారికంగా క్లారిటీ ఇవ్వనున్నారు.