Begin typing your search above and press return to search.
గవర్నర్ కు ఆ అధికారం లేదని చెప్పిన కేసీఆర్
By: Tupaki Desk | 13 March 2016 10:21 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట చాలా స్పష్టంగా ఉంటుంది. కొన్ని అంశాల మీద ఆయన చాలా స్పష్టంగా చెబుతుంటారు. నిజానికి కొన్ని అంశాల మీద ఆయన మాట్లాడే సమయంలో కొద్ది సమయం కానీ కేటాయిస్తే.. కొన్ని పుస్తకాలు చదివితే కానీ రాని అవగాహన కాసేపట్లోనే వచ్చేస్తుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా.. గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తిప్పి కొట్టారు. అంతేకాదు.. గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన అంశాలపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగాన్ని ప్రభుత్వమే తయారు చేస్తుందని.. క్యాబినెట్ ఆమోదించిన ప్రసంగాన్ని మాత్రమే ఆయన చదువుతారని.. దాన్ని మార్చే అధికారం ఆయనకు లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం చెప్పేదే ఫైనల్ అని తేల్చేసిన కేసీఆర్.. ఆ విషయం విపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలకు కూడా తెలిసని.. అయినా రాజకీయం కోసం విమర్శలు చేస్తున్నారంటూ మండి పడ్డారు. గవర్నర్ ప్రసంగంపై తరచూ విపక్షాలు చేసే విమర్శలపై కేసీఆర్ తాజాగా ఇచ్చిన స్పష్టతతో మరోమారు ఆ తరహా విమర్శలు చేసే అవకాశం లేనట్లే.