Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ జంపింగ్ ఎమ్మెల్యేల‌పై కేసీఆర్ ప‌క్కా ప్లాన్‌..!

By:  Tupaki Desk   |   15 July 2022 2:30 AM GMT
టీఆర్ ఎస్ జంపింగ్ ఎమ్మెల్యేల‌పై కేసీఆర్ ప‌క్కా ప్లాన్‌..!
X
రాజ‌కీయాల్లో ఎత్తులు పై ఎత్తులు కామ‌న్‌. తాడిత‌న్నేవాడికి.. త‌ల‌త‌న్నేవాడు ఉంటార‌ని అంటారు. ఇప్పు డు ఇదే విష‌యం తెలంగాణ రాజ‌కీయాల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. త‌నను ఎదిరించే నాయ‌కుల‌కు అదే త‌ర‌హాలో చెక్ పెట్టాల‌ని.. టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయాల‌ని అను కుంటున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ రాజ‌కీయాలు పుంజుకున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌లే టార్గెట్‌గా ఈ రెండు పార్టీలు కూడా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో అధికార పార్టీ టీఆర్ ఎస్ నుంచి కొంత మంది నాయ‌కులు.. బీజేపీ వైపు చూస్తున్నార‌నే సంకేతాలు కొన్నాళ్లుగా వ‌స్తున్నాయి. అదేస‌మ‌యంలో కొంద‌రు ఇప్ప‌టికే కాంగ్రెస్ గూటికి చేరిపోయారు.

మ‌రికొంద‌రు త్వ‌ర‌లోనే త‌మ దారి తాము చూసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ఇలాంటి వారికి త‌న‌దైన శైలిలో చెక్ పెట్టాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌శాంత్ కిశోర్ సార థ్యంలోని బృందాలు.. స‌ర్వేలు పూర్తి చేశాయి.

అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ఎవ‌రు నెగ్గుతారు.,. ఎవ‌రు త‌గ్గుతారు.. అనే విష‌యాల‌పై స‌ర్వే చేసి.. కేసీఆర్‌కు నివేదిక పంపించార‌ని తెలుస్తోంది. దీని ప్ర‌కారం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడిపోయే నాయ‌కుల‌కు టికెట్ ఇవ్వ రాద‌ని.. కేసీఆర్ నిర్ణ‌యించుకున్న‌ట్టు టీఆర్ ఎస్ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. ఇలాంటి వారంతా కూడా ప‌క్కచూపులు చూస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ నేత‌ల‌తో ట‌చ్‌లోకి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యంపై ఉప్పందిన కేసీఆర్‌.. ఇలాంటివారికి గ‌ట్టి వార్నింగ్ పంపే యోచ‌న‌లో ఉన్నార‌ని స‌మాచారం.

దీనిపై ఆయ‌న త్వ‌ర‌లోనే బ‌య‌ట‌పడ‌తార‌ని.. ఉండే వారు ఉండండి పోయే వారు పోండి! అనే హెచ్చ‌రిక లు పంప‌నున్నారు. . టిక్కెట్లు లభించే చాన్స్ లేని పాతిక మంది ఎమ్మెల్యేల వరకూ ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్న విష‌యంపై ఆయ‌న సీరియ‌స్‌గానే ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో వారి దారి వారు చూసుకోవ‌చ్చ‌ని.. స్వ‌యంగా కేసీఆర్ ప్ర‌క‌టించే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు.

ఇదే జ‌రిగితే.. ఖ‌చ్చితంగా బ‌ల‌మైన సంకేతాలు పంపిన‌ట్టు అవుతుంద‌ని, దీనివ‌ల్ల‌.. పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేద‌నే వ్యూహాన్ని అమ‌లు చేయ‌డం ద్వారా.. ఉన్న‌వారిలో కేసీఆర్ ప‌ట్ల మ‌రింత న‌మ్మ‌కం.. విశ్వాసం చూర‌గొనే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.