Begin typing your search above and press return to search.
తెలంగాణ ప్రాజెక్టులన్నీ వివాదాల్లో ఇరికించారు
By: Tupaki Desk | 31 March 2016 8:04 AM GMTసమగ్ర జల విధానంపై శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభమైంది. సభలో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్లపై సభ్యులు వీక్షిస్తున్నారు. శాసన మండలిలో ఈ - ప్రజెంటేషన్ ద్వారా వీడియో ప్రజెంటేషన్ చేస్తున్నారు . ముఖ్యమంత్రి కేసీఆర్ కంప్యూటర్ ద్వారా ఆపరేట్ చేస్తూ గూగుల్ మ్యాప్ ల సహాయంతో సాగు - తాగు నీటి ప్రాజెక్టుల వివరాలు వెల్లడిస్తున్నారు.
మహారాష్ట్రలో 450 ఆనకట్టలు కట్టారని, ఏ ఒక్క నదినీ వదిలిపెట్టకుండా బ్యారేజీలు - ప్రాజెక్టులు నిర్మించారని, దీని వల్ల తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. దేవుడు కరుణిస్తే కానీ ఎస్సారెస్పీకి నీరు రావని చెప్పారు. మహారాష్ట్ర బ్యారేజీలు - ప్రాజెక్టులు పూర్తిగా నిండిన తర్వాత కూడా వర్షాలు పడితేనే నీళ్లు కిందికి వచ్చేదన్నారు. ఈ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటితో ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నామని చెప్పారు. అధికారులను హెలికాప్టర్లలో పంపి మరీ సర్వేలు చేయించామన్నారు. రేయింబవళ్లు శ్రమించి ప్రాజెక్టులపై రిపోర్ట్ తయారుచేసినట్లు కేసీఆర్ చెప్పారు.
సమైక్య పాలనలో తెలంగాణపై ఎన్నో కుట్రలు చేశారని.. కిన్నెరసాని నీరు ధవళేశ్వరానికి వెళ్లేలా చేశారని ఆరోపించారు. కిన్నెరసాని ప్రాజెక్టు ప్రాంతంలో పది కిలోమీటర్ల వరకు మానవ సంచారం లేకుండా చేసేందుకు అక్కడ అభయారణ్యంగా ప్రకటించారన్నారు. రాజీవ్ సాగర్ పరిధిలోనూ 18 కిలోమీటర్లుగా ఎకో జోన్ గా ప్రకటించారన్నారు. పర్యావరణ అనుమతుల నెపంతో ప్రాజెక్టులను పెండింగులో పెట్టేవారన్నారు. దుమ్ముగూడెం ప్రాజెక్టుతో తెలంగాణకు ఒక్క పైసా లాభం లేదని తేల్చేశారు. కాంతనపల్లి ప్రాజెక్టుపై చత్తీస్ గఢ్ నుంచి అభ్యంతరాలున్నాయని... దాన్ని అంతర్రాష్ట్ర వివాదంలో ఇరికించారని ఆరోపించారు. అందుకే దాన్ని రీడిజైన్ చేసి చత్తీస్ గడ్ తో వివాదం లేకుండా చేసి నిర్మించాలనుకుంటున్నామని.. దీనిపై ఏవైనా ఇబ్బందులు వచ్చే అవకాశముందా అన్నది సభ్యులు సలహాలు ఇవ్వాలని కోరారు. అన్ని ప్రాజక్టులను రీ డిజైన్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోందన్నారు. తుపాకుల గూడెం వద్ద కొత్తగా బ్యారేజి నిర్మిస్తామన్నారు.
ప్రాజెక్టుల రీడిజైన్ చేయాలనుకోవడానికి చాలా కారణాలున్నాయన్న కేసీఆర్ ప్రస్తుత డిజైన్ల వల్ల కేవలం తెలంగాణకే కాకుండా ఆంధ్రకు కూడా నష్టమేనని.. రీడిజైన్ వల్ల రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రభుత్వం పైన 450 ఆనకట్టలు కట్టిందని.. ఒక్క పెన్ గంగపైనే 31 కట్టారని.. మరో తొమ్మిది కడుతున్నారని.. దీనివల్ల 100 టీఎంసీల నీరు కోల్పోతామన్నారు. కర్ణాటకలో కిందిక నీరు రాకుండా అనేక ఆనకట్టలు కట్టేసారని చెప్పారు. చాలా ప్రాజెక్టులకు చత్తీస్ గఢ్ తో వివాదాలు వచ్చేలా డిజైన్ చేశారని ఆరోపించారు.