Begin typing your search above and press return to search.
పాతబస్తీలో చట్టాలు పని చేయవా కేసీఆర్?
By: Tupaki Desk | 3 Feb 2016 4:26 AM GMTసరిగ్గా ఆరు రోజుల క్రితం..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఆయన తన వాదనను వినిపించేందుకు సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా మజ్లిస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ మధ్య అధికారిక ఒప్పందం ఏమీ లేదని.. కాకుంటే.. తెలంగాణ అసెంబ్లీలో మజ్లిస్ నేతలు మాట్లాడుతూ.. తెలంగాణ అధికారపక్షానికి మిత్రులుగా ఉంటామని.. తెలంగాణ అభివృద్ధిలో పాలు పంచుకుంటామని చెప్పారని.. ఓపెన్ గా అసెంబ్లీలోనే వారు చెప్పిన మీదన వారు మిత్రులే అవుతారు కదా అంటూ కొత్త లాజిక్ వినిపించారు.
అసెంబ్లీలో ఎవరు ఏదైనా మాట్లాడితే.. అదే ప్రామాణికమా? అన్న డౌట్ చాలామందికి వచ్చింది. ఉదాహరణకు.. ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సహకరిస్తాం.. రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వంతో కలిసి భాగస్వామ్యం అవుతామని సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత విపక్ష నేతలు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామంటే.. వారు ప్రభుత్వంతో భాగస్వామ్యం అయినట్లా? లేక.. ప్రభుత్వానికి తమ సహకారం అందిస్తారా? అని అనుకోగలమా? సరిగా ఇలాంటి సందేహం వచ్చేలా కేసీఆర్ మాట్లాడారు.
కేసీఆర్ చెప్పే మాటలకు చాలావరకూ మీడియా ఎదురుప్రశ్నలు వేయదు. ఒకవేళ వేసినా.. వారి ముఖం పగిలిపోయేలా పంచ్ లో.. లేదంటే.. ‘‘మీకు చెబుతున్నది అర్థం కావట్ల’’ లాంటి చురుకులు తగులుతాయి. ఈ నేపథ్యంలో గతంలో మాదిరి ఘాటైన ప్రశ్నలు సంధించే పరిస్థితి ఇప్పుడు ఎక్కడా లేకుండా పోయింది. ఇది కేసీఆర్ ప్రెస్ మీట్ లోనే కాదు.. చంద్రబాబు ప్రెస్ మీట్లు కూడా ఈ తరహాలోనే సాగుతున్నాయ్. బాబును చిరాకు పెట్టే ప్రశ్నలు వేస్తే.. నీదే మీడియా అంటూ అడిగేస్తున్నారు. ఇలా మీడియా సంస్థల పేరుతో ఎదురుదాడి చేయటం వైఎస్ జమానా నుంచి మొదలైంది. ఇదిప్పుడు అందరికి ఓ అలవాటుగా మారింది.
ఒక ముఖ్యమంత్రి ఒక రాజకీయ పార్టీని తన మిత్రుడిగా పేర్కొన్న తర్వాత.. అదే పార్టీ నేతలు.. ఉప ముఖ్యమంత్రి ఇంటి మీద దాడి చేయటం.. ఉప ముఖ్యమంత్రి కుమారుడి మీద భౌతికదాడికి పాల్పడటం ఏమిటన్నది ప్రశ్న. ఉప ముఖ్యమంత్రి ఇంటికే రక్షణ లేకపోతే.. మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉంటుందన్నది మంగళవారం పాతబస్తీలో మజ్లిస్ చేసిన వీరంగంతో విస్పష్టమైంది.
ఇంతలా రెచ్చిపోయిన మజ్లిస్ మూకను చూశాక.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అడిగే ప్రశ్న ఒక్కటే.. తెలంగాణ రాష్ట్రంలో మజ్లిస్ నేతలకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయా.. వారేం చేసినా నడిచిపోతుందా? అని. దీనికి ఆయన సూటి సమాధానం చెబితే చాలు.