Begin typing your search above and press return to search.

మంత్రులు మల్లన్న, గంగుల ఔటేనా? సంక్రాంతికే ముహూర్తమట?

By:  Tupaki Desk   |   3 Jan 2023 4:30 PM GMT
మంత్రులు మల్లన్న, గంగుల ఔటేనా? సంక్రాంతికే ముహూర్తమట?
X
ఓవైపు రెండుసార్లు గెలిచిన వ్యతిరేకత.. మరోవైపు తరుముతున్న బీజేపీ మధ్య సీఎం కేసీఆర్ ఏదో ఒక మ్యాజిక్ చేసి వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో బయటపడుతున్న అసమ్మతిని కంట్రోల్ చేయడానికి పూనుకుంటున్నారు. ఈ క్రమంలోనే అసంతృప్తిని తగ్గించడం.. పార్టీని గాడినపెట్టేందుకు మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ చేయాలని డిసైడ్ అయినట్టు సమాచారం.

ప్రస్తుతానికి కొంతంమంది ఎమ్మెల్యేల పనితీరుతోపాటు మరికొంతమంది మంత్రుల వ్యవహారం కూడా బాగాలేదని కేసీఆర్ చేసిన సర్వేలో తేలింది. ఈ నివేదికను లోతుగా పరిశఈలించిన కేసీఆర్ ఇద్దరు మంత్రులపై వేటు వేయాలని.. ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నట్టు సమాచారం.

ఈ ఇద్దరిలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ లపై సీఎం కేసీఆర్ వేటు వేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కూడా తెలంగాణ మంత్రుల్లోనే కుబేరులు. ఆర్థికంగా అండదండలు అందించేవారే. కానీ వీరికి పదవులు ఇచ్చి ఉద్యమించిన వారికి.. పార్టీలోని సీనియర్లకు అన్యాయం చేశారన్న వాదన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో గూడుకట్టుకొని ఉంది. అందుకే ఇది తొలగించడానికి కేసీఆర్ సంక్రాంతికి మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించడానికి రెడీ అయినట్టు సమాచారం.

మల్లారెడ్డి, గంగుల కమలాకర్ ల స్థానాల్లో ఎమ్మెల్సీ బండ ప్రకాష్, ఎమ్మెల్యే బాల్క సుమన్ లను కేబినెట్ లోకి తీసుకునేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మల్లారెడ్డి  రెడ్డి సామాజికవర్గం, గంగుల కాపు బీసీ సామాజికవర్గం. వీరి స్థానాల్లో బీసీ, ఎస్సీలకు కేసీఆర్ స్థానం కల్పిస్తున్నారు.

వివాదాలతోనే మల్లారెడ్డి, గంగులను సాగనంపేందుకు కేసీఆర్ రెడీ అయినట్టు సమాచారం. వివాదాలు ఉంటే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని.. చర్యలకు వెనుకాడకూడదన్న సందేశం ఇచ్చేందుకే కేసీఆర్ ఇలా స్టిక్ట్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సంక్రాంతి తర్వాత ప్రారంభం కానున్న కొత్త సచివలయంలోకి స్వల్ప మార్పులు చేసి కొత్త టీంతో ఎంట్రీ ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టు సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.