Begin typing your search above and press return to search.
కేసీఆర్ లక్ష కోట్లు ఖర్చు చేసేనా?
By: Tupaki Desk | 16 Dec 2015 4:50 PM GMTతెలంగాణలో వ్యవసాయం ఇప్పుడు ఎడారిగా మారింది. ఈ ఏడాది రబీ కూడా పూర్తి స్థాయిలో తుడిచిపెట్టుకుపోయినట్లే. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో తెలంగాణలో వ్యవసాయ భూములు కనిపించడం దాదాపు అసాద్యమేనని చెప్పవచ్చు. ఇందుకు కారణం.. ఇటు వర్షాలూ లేక.. అటు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీళ్లు కూడా లేకపోవడమే.
తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ చేపట్టింది. వర్షాకాలంలో భారీ వర్షాలు కురిస్తే చెరువులు నిండుతాయని, దాంతో భూగర్భ జలం పెరుగుతుందని, చెరువు నీళ్లు సాగుకు ఉపయోగపడతాయనేది ప్రభుత్వ ఉద్దేశం. అయితే, భారీ వర్షాలు కురిస్తేనే మిషన్ కాకతీయతో ఉపయోగం. లేకపోతే ఏమీ లేదు.
రెండోది, తెలంగాణకు ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక - మహారాష్ట్రలు చిన్న చిన్న ప్రాజెక్టులు - బ్యారేజీలు నిర్మిస్తున్నాయి. దాంతో కృష్ణా - గోదావరి నదుల ద్వారా ఆయా రాష్ట్రాల నుంచి కిందికి రావాల్సిన ఒక్క చుక్క నీళ్లు కూడా కిందకు రావడం లేదు. దాంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి దుమ్ముగూడెం వరకూ తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులూ ఎండిపోయాయి. వాటి కింద ఆయకట్టు కూడా ఎడారిని తలపిస్తోంది. ఇప్పుడు మాత్రమే కాదు.. గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి.
దీనికి పరిష్కారం కేసీఆర్ తలపెట్టిన రివర్స్ ఇంజనీరింగ్. అంటే 200 కిలోమీటర్ల దిగువ ఉన్న మేడిగడ్డ రిజర్వాయర్ నుంచి నీ ముక్కు ఎలా ఉందంటే చూపించినట్లు తిప్పుతూ దానిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తీసుకు వెళ్లాలి. ఇంతా చేస్తే ఇందుకు ఖర్చయ్యేది లక్ష కోట్ల రూపాయలు. అంతా ఖర్చు చేస్తే 12 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అవుతుంది.. మరో 12 లక్షల ఎకరాల ఆయకట్టు కొత్తగా వస్తుంది అంతే. అయినా ఖర్చుకు ప్రభుత్వం సిద్ధమైంది. నాలుగేళ్లలో ఏడాదికి పాతిక వేల కోట్ల చొప్పున ఖర్చు చేస్తామంటోంది. ఇంత ఖర్చు చేయాలంటే మిగిలిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ఖర్చులను పూర్తిగా తగ్గించాలి. మరి అందుకు ప్రభుత్వం సిద్ధపడుతుందా?