Begin typing your search above and press return to search.
ఫాంహౌస్ కేసులో ఇరకాటంలో కేసీఆర్ సర్కార్
By: Tupaki Desk | 7 Jan 2023 1:30 PM GMTఎరక్కపోయి ఇరుక్కున్నట్టు అయ్యింది కేసీఆర్ పరిస్థితి. ఫాంహౌస్ కేసులో ఎలా ముందుకెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే సింగిల్ జడ్జి ఈ కేసును సీబీఐకి అప్పగించారు. సీబీఐ అధికారులు వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ సీఎస్ కు లేఖ రాశారు. ఇవ్వకుంటే కోర్టు ధిక్కరణ.. ఇస్తే ఫాంహౌస్ కేసులో సర్కార్ కు టెన్షన్.. దీంతో అయోమయంలో అధికార బీఆర్ఎస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. న్యాయనిపుణులతో సీఎం కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు.
ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో ‘ముందునుయ్యి.. వెనుక గొయ్యి’ మారింది. ఫాంహౌస్ కేసు విచారణ సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసును విచారించేందుకు సీబీఐ రెడీ అయ్యింది.
ఈ కేసుకు సంబంధించిన పత్రాలను ఇవ్వాలని రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి సీబీఐ లేఖ రాసింది. దీనిపై ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదు. ఇదే విషయాన్ని శుక్రవారం హైకోర్టుకు సీబీఐ తెలిపింది. ఈ కేసు విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై న్యాయనిపుణులతో కేసీఆర్ చర్చిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు సీబీఐకి కేసు అప్పగిస్తే పరువు పోతుందని.. బీజేపీ చేతిలో ఓడిపోయినట్టు అవుతుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.
బీజేపీతో ఫైట్ లో ఎక్కడా తగ్గకూడదని కేసీఆర్ సర్కార్ డిసైడ్ అయ్యింది. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సంచలన నిర్ణయం తీసుకుంది. విచారణను సీబీఐకి అప్పగించాలన్న హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీల్ కు వెళ్లింది. అయితే బీజేపీ విషయంలో ఎక్కడ తగ్గకూడదని.. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిక్కచ్చిగా ఉండాలని.. అందుకే అవసరమైతే హైకోర్టుకు.. సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాలని కేసీఆర్ సర్కార్ పట్టుదలతో ఉంది.
కేసీఆర్ ప్రభుత్వం వేసిన పిటీషన్ హైకోర్టు డివిజన్ బెంచ్ సోమవారం విచారించనుంది. మరి ఆ రోజు ప్రభుత్వం కోర్టు ముందు ఏం వాదనలు వినిపిస్తుందనే ఆసక్తి నెలకొంది. ఒకవేళ హైకోర్టులో ప్రతికూల తీర్పు వస్తే వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అక్కడ ఉపశమనం లభిస్తుందా? లేదా? అనే కోనంలో సీఎం కేసీఆర్ న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. సుప్రీంకోర్టు న్యాయవాదులు, రిటైర్డ్ జడ్జీల సలహాలు తీసుకుంటున్నట్టు తెలిసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.