Begin typing your search above and press return to search.
ఆఫ్తుడు కొడుకు సంగతేంది కేసీఆర్..?
By: Tupaki Desk | 21 Oct 2015 4:34 AM GMTఆ మధ్య జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి. కిష్టారెడ్డి ఆకస్మిక మరణం గురించి మాట్లాడుతూ.. పార్టీ వేరు అయినా.. కిష్టారెడ్డి తనకెంత ఆప్తులన్న విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా నాన్ స్టాప్ గా చెప్పుకొచ్చారు. కిష్టారెడ్డి మరణంతో తాను వ్యక్తిగతంగా చాలా నష్టపోయినట్లుగా కేసీఆర్ చెప్పుకొచ్చారు.
ఇలాంటి మాటలు విన్నప్పుడు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ముచ్చట కలిగేలా చేస్తుంది. పార్టీతో సంబంధం లేని ఒక నేతతో తనకున్న సంబంధం.. అనుబంధం లాంటివి సమకాలీన రాజకీయాల్లో చాలా అరుదుగా అనిపిస్తాయి.
అయితే.. మాటల్లో కనిపించేంత దగ్గరితనం చేతల్లో ఉండదన్న విషయం కేసీఆర్ నిర్ణయాలు చూస్తే ఇట్టే అర్థమవుతాయి. తనకెంతో ఆప్తుడైన కిష్టారెడ్డి మరణంతో.. ఖాళీ అయిన నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ స్థానాన్ని ఏకగ్రీవం కంటే కూడా.. ఉప ఎన్నిక పక్కాగా జరగాలన్న తలంపు చూసినప్పుడు కేసీఆర్ మాటలకు.. చేతలకు మధ్య వ్యత్యాసం ఇట్టే అర్థమవుతుంది.
సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మరణిస్తే.. ఆ కుటుంబానికి చెందిన వారిని ఏకగ్రీవం చేయటం.. పోటీలో అభ్యర్థుల్ని బరిలో నిలపరు. కానీ.. ఆ సంప్రదాయానికి భిన్నంగా నారాయణఖేడ్ ఉప ఎన్నికకు తమ అభ్యర్థిని బరిలోకి దింపాలని అధికారిక టీఆర్ ఎస్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కిష్టారెడ్డి కుమారుడ్ని పార్టీలోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.
అయితే.. ఆ మాటల్లో నిజం లేదని.. కిష్టారెడ్డి కుమారుడు సంజీవ్ రెడ్డినే తమ పార్టీ అభ్యర్థిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ అయిన దిగ్విజయ్ సింగ్ స్వయంగా ప్రకటించారు. దీంతో.. నారాయణ ఖేడ్ ఉప ఎన్నికల రసకందాయంలో పడింది. తనకెంతో ఆప్తుడైన కిష్టారెడ్డి కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఇబ్బంది పెట్టేలా ఉప ఎన్నికకు అభ్యర్థిని నిలపటం ఆసక్తికరంగా మారింది. తన మాటలతో కిష్టారెడ్డిపై తనకున్న అభిమానాన్ని ప్రదర్శించిన కేసీఆర్.. చేతల్లో మాత్రం అందుకు భిన్నంగా బరిలోకి పార్టీ అభ్యర్థిని నిలపటంపై నారాయణ ఖేడ్ నియోజకవర్గ ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది. మరోవైపు ఆప్తుడి కుమారుడికి ఇబ్బంది కలిగించేలా అభ్యర్థిని బరిలోకి నిలపటంపై కేసీఆర్ ఎలాంటి వివరణ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.