Begin typing your search above and press return to search.
‘‘17’’తో లెక్కలు చాలానే మారిపోతున్నాయ్
By: Tupaki Desk | 19 Aug 2016 6:14 AM GMTదసరా నాటికి కొత్త జిలాల్ని అమల్లోకి తీసుకురావాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తన ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. మొన్నటి వరకూ 14 కొత్త జిల్లాల మీదనే కసరత్తు చేసిన అధికారులు.. మారిన ముఖ్యమంత్రి మైండ్ సెట్ కు తగ్గట్లే 17 కొత్త జిల్లాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేపట్టారు. కొత్త జిల్లాల సంఖ్య మూడుకు పెరగటంతో జిల్లాల వారీగా ఉండే మండలాలు.. అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి.
ముఖ్యమంత్రి కొత్త ఆలోచనకు తగ్గట్లే.. ఇప్పటివరకూ తయారు చేసిన ప్రతిపాదనల్ని పక్కన పెట్టిన అధికారులు.. కొత్తగా వచ్చి చేరిన కొత్త జిల్లాలు.. పాత ప్రతిపాదనలకు సమన్వయం చేసే పనుల్లో తలమునకలైపోయారు. మొదట అనుకున్న ప్రకారం 24 జిల్లాలకు అనుగుణంగా మండలాలు.. అసెంబ్లీ నియోజకవర్గాల్ని సిద్ధం చేశారు. చివర్లో మూడు కొత్త జిల్లాల ప్రతిపాదనను సీఎం కేసీఆర్ తెర మీదకు తీసుకురావటంతో.. ఈ కొత్త జిల్లాలకు తగిన మండలాల్ని సిద్దం చేయటం.. వాటికి తగ్గట్లే అసెంబ్లీ నియోజకవర్గాల కేటాయింపుపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.
తాజాగా మారిన కొత్త లెక్కతో ప్రతి జిల్లాలోనూ 10 నుంచి 15 లక్షల జనాభా ఉండేటట్లు చూడటంతో పాటు.. 20 వరకూ మండలాలు ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్ని కొత్త జిల్లాలకు కేటాయించిన నేపథ్యంలో.. గతంలో అనుకున్న జిల్లాల్లోని నియోజకవర్గాల రూపురేఖలు మొత్తంగా మారిపోతున్నాయి.
తాజాగా చోటు చేసుకున్న కొత్త మార్పుతో.. హుజురాబాద్.. పరకాల.. వరంగల్ పశ్చిమ.. స్టేషన్ ఘన్ పూర్.. వర్ధన్నపేటల్లో సగం హన్మకొండ జిల్లా కిందకు రానున్నాయి. మరోవైపు వరంగల్ జిల్లా కింద తర్పు వరంగల్.. నర్సంపేట.. పాలకుర్తి.. వర్ధన్నపేటలో సగభాగం మిగలనున్నాయి.
కరీంనగర్ ను తొలుత అనుకున్న రెండు జిల్లాల కాస్తా ఇప్పుడు మూడు ముక్కలు కానున్న నేపథ్యంలో ఈ జిల్లాల అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా మారిపోనున్నాయి. మూడోజిల్లాగా పెద్దపల్లిని నిర్ణయించటంతో గతంలో వేరే జిల్లాలకు కేటాయించిన మూడు నియోజకవర్గాలు దీన్లో చేరనున్నాయి. గతంలో వరంగల్ జిల్లా భూపాల పల్లికి కేటాయించిన మంథని ఇప్పుడు పెద్దపల్లిలో చేరనుంది.
ఇదిలా ఉంటే రంగారెడ్డి జిల్లాకు కొత్తగా శంషాబాద్.. మల్కాజ్ గిరి జిల్లాల్ని తెరపైకి తీసుకురావటంతో అందుకు తగ్గట్లే అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయ్. జీహెచ్ ఎంసీ పరిధిలోని నియోజకవర్గాలతో పాటు.. శంషాబాద్ జిల్లా కింద షాద్ నగర్ ను చేరుస్తున్నారు. దీంతో.. మహబూబ్ నగర్ జిల్లాలో ఒక నియోజకవర్గం తగ్గనుంది. మొత్తంగా చూస్తే.. కొత్తగా ప్రతిపాదించిన మూడు కొత్త జిల్లాల పుణ్యమా అని దాదాపు 30 రెవెన్యూ డివిజన్లు.. 200లకు పైగా మండలాల్లో మార్పులు చోటు చేసుకోవటం గమనార్హం. జిల్లాల సంఖ్యను 14నుంచి 17కు పెంచటంతో మారే అసెంబ్లీ నియోజకవర్గాలతో రాజకీయ సమీకరణాల్లో భారీగా మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయి.