Begin typing your search above and press return to search.
కేసీఆర్ రేంజ్ అంటే..ఇలా ఉంటుంది మరి
By: Tupaki Desk | 13 Sep 2016 8:28 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు కొత్త సమస్య వచ్చిపడింది. ఆయన ఎంతగానో ఇష్టపడి మొదలు పెట్టిన జిల్లాల విభజన కొలిక్కి వచ్చిందని భావిస్తున్న తరుణంలో వాటిని పేర్లు ఖరారు చేయడంపై పేచీ మొదలయింది. ఈ దసరా నుంచి మనుగడలోకి రానున్న కొత్త జిల్లాలకు పేర్లు ఖరారు చేసే అంశంపై ప్రభుత్వ వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి. ఆయా ప్రాంతాల ముఖ్య నేతలు - స్థానిక ఆవశ్యకత - చారిత్రక వైభవం - అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ వద్ద పేర్ల ప్రతిపాదనలు పెట్టారు. ఇవి భారీ సంఖ్యలో ఉండటం, అదే స్థాయిలో అసంతృప్తులు ఏర్పడటంతో ప్రజా ప్రతినిధులు - ప్రజలు - వివిధ రాజకీయ పార్టీల నేతల నుంచి అందిన విజ్ఞప్తులను మంత్రివర్గ ఉపసంఘం - టాస్క్ ఫోర్స్ కమిటీ పరిశీలిస్తోంది.
ఇదిలాఉండగా కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల్లో ఆరింటికి సోమవారం పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న రంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మల్కాజిగిరి జిల్లాకు చారిత్రక అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మేడ్చల్ జిల్లాగా నామకరణం చేయాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. మరో ఐదు జిల్లాలకు ఒకటి - రెండు రోజుల్లోగా పేర్లను ఖరారు చేయనున్నారు. అయితే పేర్ల ఖరారులో వీలనైంత వరకు వివాదం లేకుండా చూడాలని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. మరోవైపు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే విజయదశమి నుంచి కొత్త జిల్లాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అప్పటిలోగా పేర్లు - భౌగోళిక పరిసరాలు - హద్దులు - మండలాల కూర్పు తదితర అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. పండగ వాతావరణంలో కొత్త జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఉపసంఘం కార్యాచరణ ప్రణాళికను తయారు చేస్తోంది. తెలంగాణ ఆవిర్భవించాక కొత్త జిల్లాల ప్రారంభం అత్యంత కీలకమైన ఘట్టం అయినందున ఈ ప్రతిష్టాత్మక కార్య క్రమాన్ని ఘనంగా - వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయవలసిందిగా వారం రోజుల క్రితమే సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పూర్తిస్థాయి సమన్వయంతో పనిచేయాలని ఇటు అధికార వర్గాలకు అటు పార్టీ వర్గాలకు దిశానిర్ధేశం చేశారు.
దీంతో కొత్త జిల్లా కేంద్రాల్లో అట్టహాసంగా ప్రారంభోత్సవ వేడుకలను నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగమంతా సిద్ధమవుతోంది. సీఎం ఆదేశాల మేరకు పార్టీ - ప్రభుత్వం సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ పరంగా తెలంగాణ ధూందాం కార్యక్రమాలు - ప్రభుత్వ పరంగా కళాజాత కార్యక్రమాలు - జానపద - నృత్య ప్రదర్శనలు - సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రతిష్టను - ఇక్కడి చారిత్రక వైభవాన్ని దేశం నలుమూలలా చాటిచెప్పే విధంగా అంగరంగ వైభవంగా కొత్త జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమాల కార్యాచరణ ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. శాఖల వారీగా కార్యాచరణ ప్రణాళికలు తయారవుతున్నాయి. దసరా పర్వదినం నాడే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాలను నిర్వహిస్తున్నందున తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఇంట్లో పండగ వాతావరణం సంతరించుకోనుంది. అందుకు తోడు జిల్లా కేంద్రాలు - డివిజనల్ కేంద్రాలు - కొత్తగా ఏర్పాటయ్యే మండల కేంద్రాల్లో రహదారులు - వీధులన్నీ పూలమాలలు - విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు. కొత్త కలెక్టరేట్లును ప్రత్యేక ఆకర్షణగా ముస్తాబు చేయనున్నారు. మొత్తంగా అదిరిపోయేలా కొత్త జిల్లాల ప్రారంభోత్సవం ఉండాలని కేసీఆర్ ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.