Begin typing your search above and press return to search.
నిన్నటి వరకు కింగ్ లాంటోళ్ల పరిస్థితేమంటే..
By: Tupaki Desk | 9 Oct 2016 10:30 PM GMTమంత్రికి.. ఎమ్మెల్యేకి పోలిక ఎక్కడైనా ఉంటుందా? ఒకవేళ ఇదే ప్రశ్నను అడిగితే వింతగా చూడటమే కాదు.. ఆ మాత్రం అవగాహన కూడా లేదా? అని చిరాకుగా చూడటం ఖాయం. కానీ.. మరో రెండు రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మంత్రులకు ఇలాంటి అనుభవమే ఎదురుకానుందన్న మాట బలంగా వినిపిస్తోంది. నిన్నటి వరకూ కింగ్ లా జిల్లాల్లో రాజ్యమేలిన వారి పరిస్థితి దసరా నాటి నుంచి దారుణంగా తయారవుతుందని చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల స్థానే.. 31 జిల్లాలుగా మారుతున్న వేళ.. నిన్నటి వరకూ 9 నుంచి 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకరిద్దరు మాత్రమే మంత్రులు ఉండేవారు. అంటే.. జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు పెద్దన్నగా ఉండే మంత్రి పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారనుంది. మారనున్న కొత్త జిల్లాల ముఖ చిత్రంలో ఒక జిల్లాలో నాలుగైదు.. లేదంటే ఐదారు నియోజకవర్గాలకు మించి ఉండని పరిస్థితి. అలాంటప్పుడు మంత్రిగా ప్రాతినిధ్యం వహించే వ్యక్తికి ఎంతటి ప్రాధాన్యత లభిస్తుందన్నది ఇట్టే చెప్పేయొచ్చు.
ఇప్పటివరకూ జిల్లా అన్న వెంటనే.. మంత్రికి అమితమైన ప్రాధాన్యత లభించేది. ఇప్పుడు.. జిల్లా అన్న వెంటనే ఉండే ఎమ్మెల్యేలే తక్కువ. ఆ ఎమ్మెల్యేలకు మంత్రి ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. పేరుకు మంత్రే కానీ.. జిల్లా వ్యాప్తంగా ఉండే ఎమ్మెల్యేల సంఖ్య చాలా చాలా పరిమిత స్థాయిలో ఉండటం మంత్రుల రేంజ్ ఒక్కసారిగా తగ్గిపోనుంది.
కొత్తగా జిల్లాలు ఏర్పాటు కానున్న నేపథ్యంలో.. మొత్తం 31 జిల్లాల్లో సగానికి పైనే జిల్లాల్లో మంత్రుల ప్రాతినిధ్యం లేని పరిస్థితి. ఒకవేళ.. ఇప్పటి మాదిరి అన్ని జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించేలా జాగ్రత్తలు తీసుకున్నా.. సామాజిక లెక్కల్ని పరిగణలోకి తీసుకుంటే.. చాలామంది నేతలకు అవకాశాలు మిస్ కావటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కేసీఆర్ క్యాబినెట్ లో ఉన్న మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్ని లెక్క తీసుకుంటే.. 31 జిల్లాల తర్వాత లెక్క చూస్తే 18 జిల్లాలకు మంత్రుల ప్రాతినిధ్యమే లేని పరిస్థితి చోటు చేసుకోనుంది.
మొదట్లో బాగానే ఉన్నా.. మంత్రివర్గంలో జిల్లాలకు ప్రాతినిధ్యం లేకపోవటం నేతల్లో అసంతృప్తిని మరింత పెంచేలా చేస్తుందనటంలో సందేహం లేదు. ఇది పార్టీ అధినేతకు కొత్త తలనొప్పిగా మారుతుందని చెప్పక తప్పదు. కొత్త జిల్లాలు తెర మీదకు వస్తున్న వేళ.. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య వెనువెంటనే పెరగాల్సిందే. ఆ విషయంలో జరిగే ఆలస్యం.. తెలంగాణ అధికారపక్ష అధినేతపై కొత్త ఒత్తిడికి ఎదురయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. ఇలాంటి పరిస్థితిని కేసీఆర్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.