Begin typing your search above and press return to search.
కాసులు రాబట్టుకునేందుకు పదవులిస్తున్న కేసీఆర్
By: Tupaki Desk | 8 March 2017 12:01 PM GMTరాజకీయాల్లో అనూహ్యమైన వ్యూహాలకు పెట్టింది పేరయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇపుడు పరిపాలనలో కూడా అదే ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. వట్టిపోయిన ఆవు వంటి వాటి నుంచే అమృతం వంటి పాలు ఇచ్చే మంత్రాంగాన్ని నెరుపుతున్నారు. ఇదంతా ప్రభుత్వరంగ సంస్థలు (పీఎస్ యు) ల గురించి. తాజాగా వివిధ సంస్థలు - కార్పొరేషన్ల పేరుతో పార్టీ నేతలకు పదవులు ఇస్తున్న కేసీఆర్ వీటి ద్వారా రాష్ర్టానికి కాసులు రాబట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా కలల ప్రాజెక్టులకు డబ్బుల కొరత లేకుండా స్కెచ్ వేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు గత ప్రభుత్వాలకు గుదిబండ కాగా తెలంగాణ ప్రభుత్వం వీటిని బంగారు బాతులుగా భావిస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో పీఎస్ యుల నిర్వహణ పెనుభారంగా మారింది. వీటిపై చేసిన అప్పులు తడిసిమోపెడయ్యాయి. ఒక్కో సంస్థ వందలాది కోట్ల నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో గత ప్రభుత్వాలు వీటికి పాలకవర్గాలను కూడా నియమించకుండా వదిలేశాయి. కాగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలకు పాలకవర్గాలను నియమించే పనిలో పడింది. నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఈ సంస్థల పునరుద్దరణతోపాటు కొత్తగా మరిన్ని సంస్థలను ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తోంది.
డబుల్ బెడ్ రూమ్ వంటి ప్రతిష్ఠాత్మక పథకాలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం మరోవైపు హౌసింగ్ కార్పొరేషన్ ను రద్దుకు నిర్ణయించింది. ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులను ఇప్పటికే ఇతర శాఖల్లోని ఇంజనీరింగ్ విభాగాలకు బదిలీ చేసింది. హౌసింగ్ కార్పొరేషన్ ను రద్దు చేయాలన్న నిర్ణయానికి ప్రధానంగా నిర్వహణ భారం - అప్పులే కారణం. ఒకవైపు నిర్వీర్యంగా మారిన ఇలాంటి కార్పొరేషన్ల రద్దుకు కసరత్తు చేస్తూనే మరోవైపు నష్టాల ఊబిలో కూరుకుపోయిన కార్పొరేషన్ల పునరుద్ధరణ - మరికొన్ని కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కాళ్వేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ - తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ (మిషన్ భగీరథ) - తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ రీసోర్సెస్ డవలప్ మెంట్ కార్పొరేషన్ తదితర సంస్థలను కొత్తగా ఏర్పాటు చేసింది. కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం వెనుక భారీ వ్యూహమే ఉందని సమాచారం.
రాష్ట్ర విభజన జరిగే నాటికి తెలంగాణ రాష్ట్రానికి రూ.60 వేల కోట్ల అప్పు మిగిలింది. రాష్ట్రం ఏర్పడ్డాక ఈ రెండున్నరేళ్లలో కొత్తగా చేసిన అప్పుల్ని కూడా కలుపుకుంటే రుణభారం లక్షా 20 వేల కోట్లకు చేరుకుంది. రాష్ట్రాలకు రుణ పరిమితిని ఖరారు చేసే ఎఫ్ ఆర్ బిఎం... మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రంగా తెలంగాణకు ఉన్న రుణ పరిమితిని 3 నుంచి 3.5 శాతానికి పెంచింది. దీంతో రాష్ట్రం సొంతంగా రూ.22 వేల కోట్ల వరకు అప్పు తెచ్చుకునే వెసులుబాటు కలిగింది. అయితే ఇప్పటికే చేసిన అప్పుల మొత్తం ఈ లక్ష్యాన్ని ఎప్పుడో మించిపోవడంతో కొత్తగా అప్పు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం లేకుండా పోయింది. మిషన్ భగీరథ - మిషన్ కాకతీయ - డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం వంటి పథకాలకు పెద్ద మొత్తంలో నిధులు సమీకరించుకోవాల్సి ఉంది. ప్రభుత్వం నేరుగా అప్పు చేయడానికి వెసులుబాటు లేకపోవడంతో కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వాటికి ప్రభుత్వం పూచీకత్తుగా ఉండి రుణాలు ఇప్పించడానికి పూనుకుంది. కార్పొరేషన్లు చేసే రుణాలకు ఎఫ్‌ఆర్‌బిఎం రుణ పరిమితి వర్తించదు. పైగా రాజకీయ నిరుద్యోగాన్ని తీర్చడానికి కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్లు దోహదపడతాయి. అటు దండిగా అప్పులు చేయడానికి, ఇటు నామినేటెడ్ పదవుల నియామకానికి పుష్పక విమానంలా ప్రభుత్వరంగ సంస్థలు ఉపయోగపడుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇటు నేతలకు పదవులు, అటు రాష్ట్ర ఖజానాకు అప్పులు. ఇదీ కేసీఆర్ స్కెచ్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/