Begin typing your search above and press return to search.
కేసీఆర్ మరో దళితుడిని అవమానించారా?
By: Tupaki Desk | 2 Jan 2017 10:15 AM GMTతెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడినే తొలి ముఖ్యమంత్రిగా చేస్తానన్న కేసీఆర్...కనీసం అణగారిన వర్గాల నుంచి వచ్చిన ఒక సీనియర్ ఐఏఎస్ పదవీ కాలాన్ని పొడగించలేకపోయారని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేవలం అగ్రవర్ణాల వారికే కీలక పోస్టుల్లో స్థానం కల్పిస్తున్నారని విమర్శించాయి. ఇవన్నీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రకు పొడగింపు ఇవ్వకపోవడం వల్ల వస్తున్న విమర్శలు. సీఎస్ గా ఆయన పదవీ కాలాన్ని మరో మూడు నెలలపాటు పొడిగిస్తారని అందరూ భావించారు. ఇందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ కూడా రాసింది. అయితే శనివారం అర్థరాత్రి వరకూ కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఈ పరిణామాల మధ్యనే ఆదివారం ఉదయం సీఎస్ గా ఎస్పీ సింగ్ ను నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ వెంటనే ఆయన సీఎస్ గా బాధ్యతలు స్వీకరించటం చకచకా జరిగిపోయాయి. ఈ మొత్తం వ్యవహారం ఇటు అధికారవర్గాల్లోను, అటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది.
తెలంగాణ రాష్ట్ర మొదటి ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ గతేడాది నవంబర్ 31న పదవీ విరమణ చేయడంతో ప్రదీప్‌చంద్రను ప్రభుత్వం సీఎస్ గా నియమించింది. ఆయన డిసెంబర్ 31 నాటికి ఉద్యోగ విరమణ చేస్తారనే విషయం తెలిసిందే. దీంతో గతంలో రాజీవ్ శర్మ పదవీ కాలాన్ని పొడిగించిన విధంగానే ప్రదీప్ చంద్రకూ కొనసాగింపు ఉత్తర్వులిస్తారనే చర్చ నడిచింది. రాజీవ్ శర్మ మాదిరిగా రెండుసార్లు కాకపోయినా కనీసం ఒక్కసారైనా అంటే మూడు నెలలపాటు పదవీకాలాన్ని పొడిగిస్తారని అందరూ భావించారు. ప్రదీప్ చంద్ర కూడా అదే ఆశతో ఉన్నారు. ఇదే సమయంలో సీఎస్ కాలపరిమితి పొడగింపుపై సీఎం పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. ప్రదీప్ చంద్ర కాలపరిమితిని పొడిగించటంపై ఆయన విముఖత వ్యక్తం చేశారనే వార్తలు కూడా వచ్చాయి. ఆయన స్థానంలో ఎస్పీసింగ్ ను సీఎస్ గా నియమిస్తున్నట్టు కొద్ది రోజుల కిందట సీఎంఓ వర్గాలు కూడా తెలిపాయి. ప్రదీప్ చంద్ర మాత్రం తన పదవీ కాలాన్ని సీఎం పొడిగిస్తారనే ధృడ నమ్మకంతోనే ఉన్నారు. ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం అంతటితో చేతులు దులుపుకున్నదే తప్ప అందుకనుగుణంగా పెద్దగా ప్రయత్నాలేవీ చేయలేదని తెలిసింది.
సీఎం ఒక సామాజిక వర్గానికే కొమ్ము కాస్తున్నారని ఈ సందర్భంగా పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అణగారిన వర్గాల వారిని ఆయన చిన్నచూపు చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజీవ్ శర్మ పదవీకాలం మరో రెండు నెలల్లో ముగుస్తుందనగా పదవీ కాలాన్ని పొడగించాలంటూ ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. తన ఢిల్లీ పర్యటన సందర్భంగా సాక్షాత్తు సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని కలిసి రాజీవ్ శర్మ విషయంపై విజ్ఞప్తి చేసిన సంగతి విదితమే. ఇలా రెండుసార్లు రాజీవ్ శర్మ పదవీకాలాన్ని పొడిగించేందుకు ప్రయత్నించిన ముఖ్యమంత్రి కేసీఆర్...ప్రదీప్ చంద్ర విషయంలో ఎందుకు అలా వ్యవహరించలేదనే విమర్శలు ప్రస్తుతం వెల్లువెత్తుతున్నాయి.
దళితుల పట్ల సీఎం పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని - గతంలో డిప్యూ టీ సీఎం రాజయ్య వ్యవహారంలో కూడా ఆయన ఇదే రీతిలో వ్యవహరించారని సదరు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించి దళితులను తీవ్ర అవమానికి గురి చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/