Begin typing your search above and press return to search.
రాజీవ్ శర్మ ఫ్యూచర్ చెప్పేసిన కేసీఆర్
By: Tupaki Desk | 1 Dec 2016 5:15 AM GMTసాయం చేసిన వారిని అస్సలు మర్చిపోవద్దని చెబుతారు. మిగిలిన వాటి సంగతి ఎలా ఉన్నా.. తనకు సాయం చేసిన వారిని గుర్తు పెట్టుకొని మరీ చెల్లించే వైనం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దని చెప్పకతప్పదు. తనకు సాయం చేసిన వారిని ఆయన అస్సలు మర్చిపోరు. ఒకవేళ పరిస్థితులు అనుకూలించక కాస్త ఆగినా.. ఏ మాత్రం అవకాశం వచ్చినా గుర్తు పెట్టుకొని మరీ వారి సాయానికి తగ్గట్లుగా వ్యవహరిస్తుంటారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తనకు చేదోడువాదోడుగా ఉంటూ.. తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సీఎస్ రాజీవ్ శర్మ పదవీ విరమణ చేయటం తెలిసిందే. ఆయనకు విపరీతమైన ప్రయారిటీని ముఖ్యమంత్రి ఇస్తుంటారు. ఎందుకిలా అంటే.. దాని లెక్కలు దానికి ఉన్నాయని చెబుతుంటారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆయనకు చేసిన మాట సాయం అన్నింటి కంటే విలువైనదిగా రాజకీయ వర్గాలు చెబుతుంటాయి. ఇందులో నిజం మాట ఎంతన్నది పక్కన పెడితే.. సీనియర్ అధికారిగా ఆయన సేవల్ని కేసీఆర్ విస్తృతంగా వినియోగించుకున్నారని చెప్పాలి. తన రాజకీయ జీవితంలో కేసీఆర్ అత్యున్నత స్థానాల్ని చేపట్టింది తక్కువే. ఉద్యమనేతగా ఉన్న అనుభవంతో పోలిస్తే.. పరిపాలనా విషయంలో ఆయనకున్న అనుభవం తక్కువనే చెప్పాలి.
అయినప్పటికీ.. రాజీవ్ శర్మ లాంటి అధికారుల్ని గుర్తించి.. వారికి కీలక బాధ్యతలు అప్పగించటం ద్వారా కేసీఆర్ తన చతురత ప్రదర్శిస్తుంటారు. తాజాగా పదవీ విరమణ చేసిన రాజీవ్ శర్మను విపరీతంగా పొగిడేసిన కేసీఆర్.. ఆయన ఫ్యూచర్ ఎలా ఉండనుందన్న విషయాన్ని చెప్పేశారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాజీవ్ శర్మ అందించిన సేవల్ని ప్రభుత్వం గుర్తుంచుకుంటుందని చెప్పిన కేసీఆర్.. ఆయన్ను రాష్ట్రప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమిస్తున్నట్లు వెల్లడించారు.
రిటైర్ అయినప్పటికీ.. ఆయనను చీఫ్ సెక్రటరీగా భావించి సమీక్షలకు హాజరు కావాలని చెప్పేయటం ద్వారా.. రాజీవ్ శర్మకు తెలంగాణ ప్రభుత్వంలో ఎలాంటి ప్రయారిటీ ఉంటుందన్న విషయాన్ని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇలాంటి నిర్ణయాలకు చట్టంలోని అంశాల్ని బయటకు తీసి ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని ఫీలయ్యారో ఏమో కానీ..ఒక ఉదాహరణను చెప్పుకొచ్చారు కేసీఆర్.
ఛత్తీస్ గఢ్ ఏర్పడిన తర్వాత తొలి సీఎస్ గా పని చేసిన శివరాజ్ సింగ్ సేవల్ని రిటైర్ అయ్యాక కూడా అక్కడి ప్రభుత్వం వినియోగించుకుందని చెప్పిన కేసీఆర్.. ‘‘శివరాజ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా పదమూడేళ్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికి అదే హోదాలో ఉన్నారు’’ అని చెప్పుకొచ్చారు. విభజన చట్టంలోని ప్రతి పేజీ.. ప్రతి అంశం మీదా రాజీవ్ శర్మకుపట్టు ఉందని.. అందుకే ఏపీ నుంచి.. కేంద్రం నుంచి ఎదురైన సవాళ్లను చాలా సులువుగా అధిగమించినట్లుగా చెప్పారు. మొత్తంగా.. రాజీవ్ శర్మ ఫ్యూచర్ ఎలా ఉంటుందన్న విషయంపై కేసీఆర్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసినట్లుగా చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/