Begin typing your search above and press return to search.

రాజ్య‌స‌భ కేసీఆర్ ది రైటా ? రాంగా ?

By:  Tupaki Desk   |   27 May 2016 7:30 AM GMT
రాజ్య‌స‌భ కేసీఆర్ ది రైటా ? రాంగా ?
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే రెండు రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు టీఆర్ఎస్ అభ్య‌ర్థులుగా మాజీ మంత్రి, సీనియ‌ర్ టీఆర్ఎస్ నేత కెప్టెన్ ల‌క్ష్మీకాంత్ రావు - మాజీ పీసీసీ అధ్య‌క్షుడు డి.శ్రీ‌నివాస్ ల‌ను ఎంపిక చేశారు. ఇక మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు ఎమ్మెల్యేగా ఎన్నిక‌యిన ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి - కాంగ్రెస్ నుండి టీఆర్ ఎస్ లో చేరిన ఫ‌రీదుద్దీన్ ను ఎంపిక చేశారు. అయితే వీరెవ్వ‌రూ అస‌లు పోటీలో ఉంటార‌ని ఎవ‌రూ భావించ‌లేదు. అలాంటి స‌మ‌యంలో కేసీఆర్ నిర్ణ‌యం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లో చేరిన డీఎస్ ను, ఫ‌రీదుద్దీన్ ను ఎంపిక చేసి కేసీఆర్ త‌ప్పుడు నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని టీఆర్ఎస్ వ‌ర్గాలు అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నాయి. మాజీ మంత్రి కెప్టెన్ ల‌క్ష్మీకాంత్ రావు ను ఎంపిక చేయ‌డం ప‌ట్ల ఎవ‌రూ అభ్యంత‌రాలు వ్య‌క్తం చేయ‌డం లేదు. కానీ డీఎస్, ఫ‌రీదుద్దీన్ ల‌కు అవ‌కాశాల‌ను ఎవ‌రూ జీర్ణించుకోవ‌డం లేదు.

డీఎస్ కు ఇప్ప‌టికే ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ప‌ద‌వి ఇచ్చి గౌర‌వించారు. ఆయ‌న అటు కాంగ్రెస్ లో ఉన్నా ఇంత‌క‌న్న పెద్ద ప‌ద‌వి ద‌క్కేది ఏమి లేదు. అలాంటిది ఈ ప‌దవి మీద గ‌తంలో హామీ ఇచ్చిన మీడియా అధినేత సీఎల్ రాజం వంటి వారిని ప‌క్క‌కు పెట్టి ప‌ద‌వి ఇవ్వ‌డం ప‌ట్ల అందరూ త‌ప్పుప‌డుతున్నారు. తెలంగాణ ఉద్య‌మంలో ఎంద‌రో టీఆర్ఎస్ కోస్ ఆస్తులు పోగొట్టుకుని క‌ష్ట‌ప‌డ్డ‌వారు ఉండ‌గా ఉద్య‌మంతో అస‌లు సంబంధం లేని వీరిని ఎందుకు ఎంపిక చేశార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

ఎమ్మెల్సీ ప‌దవిని శ్రీ‌కాంతాచారి త‌ల్లి శంక‌ర‌మ్మ‌కో లేకుంటే 2014 ఎన్నిక‌ల్లో న్యాయం జ‌ర‌గ‌ని నేత ఎవ‌రిక‌యినా ఇస్తార‌ని అంతా భావించారు. కానీ ఎమ్మెల్యేగా తుమ్మ‌ల ప్ర‌మాణ‌స్వీకారం పూర్తి కాగానే ఫ‌రీదుద్దీన్ పేరు ఖాయం చేయ‌డం కూడా విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. కేసీఆర్ నిర్ణ‌యాలు కొన్ని పెడ‌దారి ప‌డుతున్నాయ‌ని, ఉద్య‌మ‌కాలంలో న‌ష్ట‌పోయిన‌వారిని ఆద‌రించ‌కుండా అస‌లు ఉద్య‌మంతో సంబంధం లేనివారికి పెద్ద పీట వేయ‌డం భ‌విష్య‌త్ లో టీఆర్ఎస్ కు ఖ‌చ్చితంగా న‌ష్టం చేస్తుంద‌ని అంటున్నారు.