Begin typing your search above and press return to search.
లెక్కలు తప్పుతున్నాయ్ కేసీఆర్
By: Tupaki Desk | 17 March 2016 7:15 AM GMTతిరుగులేని ప్లానింగ్ తో దూసుకెళుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని విషయాలకు సంబంధించి మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న అంచనాలకు.. వాస్తవాలకు మధ్య దూరం పెరిగిపోవటమే దీనికి కారణం. మరో రెండు.. మూడేళ్లలో రూ.2లక్షల కోట్ల మార్క్ బడ్జెట్ ను ప్రవేశ పెడతామని ధీమాగా చెబుతున్న కేసీఆర్.. నిజంగా అలాంటి పరిస్థితి రావాలంటే.. తీసుకోవాల్సిన చర్యలు చాలానే ఉన్నాయి. ఆర్భాటంగా భారీ అంకెలతో బడ్జెట్ అంచనాల్ని ప్రవేశ పెట్టటం పెద్ద కష్టం కాదు. కానీ.. ఆ స్థాయిలో వాస్తవ గణాంకాలు కూడా ఉండాలన్న విషయం మర్చిపోకూడదు.
గడిచిన రెండు బడ్జెట్ ల విషయంలోనే తీసుకుంటే.. ఒక అంశం విషయంలో తెలంగాణ సర్కారు అంచనాలు దారుణంగా ఫెయిల్ అయ్యాయి. భూముల అమ్మకం ద్వారా భారీ ఆదాయాన్ని సంపాదించనున్నట్లు అంచనాలు ఘనంగా చెప్పినప్పటికీ.. వాస్తవంలో మాత్రం అంలాంటిదేమీ లేదని తేలింది. తెలంగాణ తొలి బడ్జెట్ లో భూముల అమ్మకం ద్వారా రూ.6500కోట్లు రాబడి వస్తుందని అంచనా వేశారు. కానీ.. పది నెలల కాలంలో భూముల వేలం ద్వారా వచ్చిన ఆదాయం కేవలం రూ.9కోట్లు మాత్రమే. అంటే.. అంచనాకు.. వాస్తవానికి మధ్య వ్యత్యాసం ఏకంగా రూ.6,491కోట్లు.
ఆ ఏడాది ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా తర్వాతి బడ్జెట్ అంచనాలు జాగ్రత్తగా వేసుకొని ఉంటే బాగుండేది. కానీ.. అలాంటిదేమీ లేకుండా 2015-16 బడ్జెట్ లో భూముల అమ్మకాల ద్వారా రూ.13,500 కోట్లు లెక్కలు వేసుకున్నారు. మొదటి బడ్జెట్ తో పోలిస్తే.. రెట్టింపు లక్ష్యాన్ని తమకు తాము పెట్టుకున్నారు. ఈ అంకెల్ని చూసినోళ్లు బుగ్గలు నొక్కుకున్న పరిస్థితి. అంత భారీ మొత్తం భూములు అమ్మటం ద్వారా వచ్చే అవకాశం లేదని నిపుణులు తేల్చేశారు.
దీనికి తగ్గట్లే ఈ ఆర్థిక సంవత్సరం ముగియటానికి మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉన్నా.. ఇప్పటివరకూ భూముల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయం కేవలం రూ.459 కోట్లు మాత్రమే. ఈ నెలాఖరు నాటికి మరో రూ.550 కోట్లు వస్తాయని చెబుతున్నప్పటికీ అది సాధ్యం కాదన్న మాట బలంగా వినిపిస్తోంది. ఏడాది మొత్తం రూ.500కోట్లు ఆదాయం రానప్పుడు.. కేవలం నెలలో రూ.500 కోట్లకు పైగా ఆదాయం ఎలా సాధ్యమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. భూములు అమ్మకాల ద్వారా పెద్ద ఎత్తున ఆదాయాన్ని పొందాలని తాను పెట్టుకున్న లక్ష్యంలో తెలంగాణ సర్కారు సాధించింది కేవలం 2.25 శాతం మాత్రమే.
ఇక.. తాజా బడ్జెట్ లోనూ భూముల అమ్మకాల ద్వారా రూ.10,900 కోట్లను ఆర్జించాలన్న లక్ష్యాన్ని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవటం కనిపిస్తుంది. గడిచిన ఏడాది లక్ష్యంతో పోలిస్తే.. ఈసారి లక్ష్యం తక్కువగా పెట్టుకున్నప్పటికీ.. వాస్తవకోణంలో చూస్తే.. ఈ మొత్తం కూడా ఎక్కువేనని చెబుతున్నారు. అంచనాలకు.. వాస్తవానికి మధ్య అంతరం పెరిగే కొద్దీ.. ప్రభుత్వ పనితీరు మీద విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉందన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోకూడదు.