Begin typing your search above and press return to search.
ఈ ప్రశ్నకు కేసీఆర్ సమాధానం చెప్పే దమ్ముందా?
By: Tupaki Desk | 17 Aug 2016 6:35 AM GMTమాటల మాంత్రికుడిగా పేరున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు ఎలా ఉంటాయో ఎవరికి ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన అధికారపక్షంలో భాగస్వామి అయిన నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు ఆయనకు ఎదురవుతున్నాయి. నిజానికి ఇలాంటి చికాకులు పవర్ లో ఉన్నప్పుడు మామూలే. విపక్షంలో ఉండే సమయంలో చెప్పే మాటలకు.. అధికారపక్షంలోకి షిఫ్ట్ అయ్యాక అనుభవంలోకి వచ్చే అంశాలతో గతంలో చెప్పిన మాటల్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే.. ఇది అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు.
తాజాగా తెలంగాణ విమోచన దినోత్సవం విషయంలో తెలంగాణ సర్కారు ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజానీకాన్ని ఏకం చేయటమే లక్ష్యంగా ఉండేది. అందుకే అలాంటి ఏ విషయాన్నైనా.. వీలైనంత ఎక్కువగా ఫోకస్ చేసి వాటికి భావోద్వేగాల్ని జోడించి లబ్థి పొందేవారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవం గురించి తరచూ ప్రస్తావించేవారు. తెలంగాణరాష్ట్రం ఏర్పడిన తర్వాత.. తాము అధికారంలోకి వచ్చి.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పదే పదే చెప్పేవారు. కానీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం ఆయన ఆ మాటను ప్రస్తావించటం తర్వాత.. గుర్తు లేనట్లుగా వ్యవహరించటం మొదలైంది.
ఉద్యమ సమయంలో భావోద్వేగాలే తప్పించి మిగిలిన అంశాలు పెద్దగా ఉండవు. కానీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తే మైనార్టీలకు పార్టీ దూరం అవుతుందన్న ఆలోచన కేసీఆర్ ను కట్టడి చేస్తోంది. మజ్లిస్ తో స్నేహబంధం నేపథ్యంలో విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే మైనార్టీల మనసుల్ని గాయపర్చినట్లుగా అవుతుందన్న భావన ప్రభుత్వంలో ఉంది. అలా అని ఆ విషయాన్ని ఓపెన్ గా అందరికి చెప్పలేని పరిస్థితి. ఒకవేళ అలాంటి మాటే వస్తే.. మిగిలిన వారిలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రావటం ఖాయం.
తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న ఈ సంకట స్థితిని బీజేపీ గుర్తించింది. తెలంగాణలో పార్టీ బలపడాలంటే కేసీఆర్ సర్కారు వ్యతిరేక ఓటు తమ ఖాతాలో పడేందుకు విమోచన లాంటి భావోద్వేగ అంశాలు పనికి వస్తాయని భావిస్తోంది. అందుకే.. విమోచన దినోత్సవాన్నిఎందుకు అధికారికంగా నిర్వహించటం లేదన్న సూటి ప్రశ్నను సంధిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. తాము లేవనెత్తిన ప్రశ్నకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పే అవకాశం లేని నేపథ్యంలో కొందరు బీజేపీ నేతలు మాటల్ని మరింత పదునుగా మారుస్తూ.. తాము అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పే దమ్ము కేసీఆర్ కు ఉందా? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. కమలనాథులు అంత ధీమాగా ప్రశ్నిస్తున్నారంటేనే.. వారు వేసే ప్రశ్నకు కేసీఆర్ అండ్ కో సమాధానం చెప్పలేదనేగా.