Begin typing your search above and press return to search.
కేసీయార్ కొత్త నినాదం....మండిస్తుందా... ?
By: Tupaki Desk | 2 Feb 2022 3:30 AM GMTకేసీయార్ రాజకీయ చతురుడు. మంచి వ్యూహకర్త. ఈ విషయంలో రెండవ మాటకు తావు లేదు. లేకపోతే కేవలం ఇద్దరే ఇద్దరు ఎంపీలను పెట్టుకుని తెలంగాణా రాష్ట్రాన్ని ఎలా సాధిస్తారు. ఇక రెండు టెర్ములు తెలంగాణాకు సీఎం గా కేసీయార్ పరిపాలన అనుభవం బాగానే గడించారు. కేంద్ర మంత్రిగా కొంతకాలం పనిచేశారు. మరో వైపు రాష్ట్ర మంత్రిగా డిప్యూటీ స్పీకర్ గా కూడా అప్పట్లో ఉన్నారు. ఇవన్నీ కాకుండా కేసీయార్ లో బ్రహ్మాండమైన ఉద్యమకారుడు ఉన్నారు. అది తెలంగాణా ఉద్యమంలో సూపర్ సక్సెస్ తో కేసీయార్ లోని మండే సూర్యుడిని బయటకు తెచ్చింది.
ఇక కేసీయార్ తెలంగాణాకే పరిమితం కాదచుకోలేదని ఆయన వైఖరి ఎప్పటికపుడు తెలియచేస్తూనే ఉంది. అందుకే ఆయన 2018 తరువాత జాతీయ రాజకీయాలు ఫెడరల్ ఫ్రంట్ అని దేశం వైపు ఒక లుక్కేశారు. 2019లో ఫెడరల్ ఫ్రంట్ పెద్దగా వర్కౌట్ కాకపోయినా ఈసారి మాత్రం జోరు చేయడం ఖాయమని గులాబీ బాస్ బలంగా నమ్ముతున్నట్లుగా ఉన్నారు.
అందుకే ఆయన నేరుగా కమలదళం మీద గురి పెట్టారు. ఈ మధ్యన ఆయన హైదరాబాద్ నుంచే కేంద్ర పెద్దలను గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. అలాంటి కేసీయార్ కి ఇపుడు కేంద్ర బడ్జెట్ రూపంలో మరో ఆయుధం దొరికింది. ఆయన ఊరుకుంటారా, మాటలతోనే చెలరేగిపోయారు. కేంద్ర బడ్జెట్ ఇలాగేనా అంటూ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.
అదంతా ఒక ఎత్తు అయితే కేసీయార్ లోని ఫైర్ ఏ రేంజిలో ఉందంటే కొత్త రాజ్యాంగం దేశానికి అవసరం అంటూ సంచలన కామెంట్స్ చేసేశారు. నిజంగా కేసీయార్ ఆవేశంతో ఈ మాట అని ఉండరు, ఆయన ఆలోచనతోనే గట్టిగా చెప్పి ఉంటారు అని అంతా అంటున్నారు. కొత్త రాజ్యాంగం అన్న మాట చాలా పెద్దది. దేశానికి స్వాతంత్రం వచ్చి ఏడున్నర పదులు కావస్తోంది.
మరో వైపు దేశీయ రాజ్యాంగం అమలు చేసుకుంటూ భారత్ 73వ ఏటకు చేరుకుంది. ఈ కీలకమైన వేళ కొత్త రాజ్యాంగం అంటూ గట్టి స్లోగన్ కేసీయార్ అందుకున్నారు. ఇప్పటిదాకా ఎవరు ఏ సమస్య ప్రస్థావించినా అవన్నీ రాజ్యాంగం పరిధిలోనే ఉండేవి. అక్కడే వాటికి పరిష్కారం కావాలని ఆకాంక్షించేవారు. కానీ కేసీయార్ తీరు చూస్తే కొత్త రాజ్యాంగం వస్తేనే తప్ప సమస్యలు తీరవు అన్నట్లుగా ఉంది.
ఒక విధంగా ఇది చాలా పెద్ద విషయం. దేశాన్ని మొత్తంగా కదిలించే విషయం. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని వర్గాల వారిలో ఏదో రకమైన అసంతృప్తి ఉంది. అయినా కానీ మన రాజ్యాంగం ప్రకారం వాటికి ఏదో నాటికి పరిష్కారం వెతుక్కుందామన్న ఆలోచనలోనే అంతా ఉన్నారు. కానీ కేసీయార్ మాత్రం అందరం కలసి దేశాన్ని మళ్ళీ నిర్మించుకుందామని చెబుతున్నారు. కొత్త రాజ్యాంగం ఏర్పాటు చేసుకుందామని అంటున్నారు.
మరి ఈ కొత్త నినాదం నిజంగా జనాలకు చేరితే అంతకంటే పవర్ ఫుల్ ఆయుధం వేరొకటి ఉండదు. ముఖ్యంగా యువత దీన్ని అందిపుచ్చుకుంటే మాత్రం కేసీయార్ ప్లాన్ సక్సెస్ అయినట్లే. ఇదిలా ఉండగా తాను ఎంపీగా పోటీ చేస్తానో లేదో ఇప్పటికి అయితే తెలియదు అంటున్నారు. అంటే జాతీయ రాజకీయాల మీద ఆయన చూపు ఉంది. ఇంకో వైపు హైదరాబాద్ వేదికగా మాజీ ఐఏఎస్ అధికారులతో మేధో మధనం పేరిట విసృత స్థాయి సమావేశం ఒకటి నిర్వహిస్తామని కేసీయార్ చెబుతున్నారు. వారి సలహా సూచనలను బట్టి జాతీయ స్థాయి అజెండాను ఖరారు చేస్తామని కేసీయార్ అంటున్నారు.
ఒక విధంగా చూస్తే కేసీయార్ లో ఫైర్ ఉంది. అలాగే నిప్పు కణిక లాంటి నినాదాన్ని అందుకుంటున్నారు. దేశంలో మార్పు రావాలీ అంటే రాజ్యాంగాన్నే ముందు మార్చాలీ అని నినదిస్తున్నారు. మరి ఈ విషయంలో ఆయన ఎందాక వెళ్తారు అన్నదే చూడాలి. గుజరాత్ కి సీఎం గా ఉన్న మోడీ ప్రధాని అవలేదా అన్న కేసీయార్ మాటల వెనక మర్మం కూడా చూడాలి.