Begin typing your search above and press return to search.
ఒక ఎన్‌కౌంటర్.. అనేక జవాబులు!
By: Tupaki Desk | 9 April 2015 4:25 AM GMTరాజకీయ ఎత్తుగడల్లో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను మించిన వారు లేరని అంటూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనలోని రాజకీయవేత్త మరింత చురుగ్గా పని చేస్తాడని కూడా రాజకీయ నాయకులు అంటూ ఉంటారు. వికారుద్దీన్ ఎన్‌కౌంటర్ విషయంలో ఈ విషయం మరోసారి రుజువైంది. వరుస కాల్పులతో.. ఉగ్రవాద ఘటనలతో తెలంగాణ అట్టుడుకుతున్న సమయంలో.. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఉవ్వెత్తున దాడి చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో ఆయన ఇటు ప్రతిపక్షాలకు, అటు ఉగ్రవాదులకు ఏకకాలంలో దీటైన జవాబు చెప్పారు.
సూర్యాపేట బస్టాండ్లో కాల్పులతో తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందుల్లో కూరుకుపోయింది. అక్కడ తనిఖీల్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపితే ఇద్దరు పోలీసులు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన తెలంగాణ పోలీసుల సమర్థతకు పరీక్షగా మారింది. దాంతో ఉగ్రవాదులను పట్టుకునేందుకు నల్లగొండ ఎస్పీ గట్టిగా ప్రయత్నించారు. ఎట్టకేలకు పక్కా వ్యూహంతో పట్టుకోగలిగారు. అయితే, అక్కడ సమన్వయ లోపంతో ఉగ్రవాదులను తక్కువ సమయంలో ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా హతమార్చడంలో విఫలమయ్యారు. అక్కడ ఎన్‌కౌంటర్లో ఇద్దరు పోలీసులను పోగొట్టుకోవాల్సి వచ్చింది. చివరికి, ఎలాగోలా ఆ ఇద్దరు ఉగ్రవాదులను ఖతం చేసినా.. తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు పరువు పోగొట్టుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో, డీజీపీ అనురాగ్ శర్మ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లు అయ్యాయి. అసలు వాళ్లు ఉగ్రవాదులు కాదని, దొంగలని వ్యాఖ్యానించడం జాతీయ స్థాయిలోనూ కలకలం రేపింది. ఇదే అంశంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడానికి సిద్ధమయ్యాయి.
నిజం చెప్పాలంటే, ఈ సమయంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆత్మరక్షణలో పడిపోయింది. జవాబు చెప్పుకోవడానికి వీల్లేని పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ సమయంలో వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్ అయాచిత వరంలా మారింది. వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌తో కేసీఆర్ ప్రభుత్వం ఇటు ప్రతిపక్షాలు నోరెత్తకుండా కట్టడి చేసినట్లు అయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో, తెలంగాణ గడ్డపై అడుగు పెడితే ఇదే తీరుగా జవాబు ఉంటుందని ఉగ్రవాదులకు కూడా ఘాటైన జవాబు ఇచ్చినట్లు అయిందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. దేశంలో ఎక్కడ ఏ ఉగ్రవాద ఘటన జరిగినా దానికి హైదరాబాద్ మరీ ముఖ్యంగా నల్లగొండ జిల్లాతో లింకు ఉంటుందనే నానుడి ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో, తన హయాంలో అటువంటి పప్పులు ఉడకవని, ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని కేసీఆర్ స్పష్టమైన సంకేతాలు పంపినట్లు అయిందని అంటున్నారు.