Begin typing your search above and press return to search.
ఢిల్లీ ఫలితంతో తెరపైకి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్
By: Tupaki Desk | 14 Feb 2020 12:30 AM GMTఅంచనా వేయటంలో కచ్ఛితత్వం.. చేయాల్సిన పనిని చేయాల్సిన సమయంలో చేయటం.. పక్కా ప్లానింగ్ తో పాటు.. ప్రత్యర్థుల్ని చిత్తు చేసే వాగ్ధాటి లాంటివి ఉంటే రాజకీయాల్లో ఎదురే ఉండదు. అయితే.. ఈ గుణాలన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిలో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. మిగిలిన ముఖ్యమంత్రులకు భిన్నంగా ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని చెప్పటంలో సారు టాలెంట్ మస్తుగా ఉంటుందన్న విషయం ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో మరోసారి రుజువైంది.
జనవరి 25న మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని స్పష్టంగా చెప్పేశారు. తెలంగాణలో సాగిన పురపోరులో భారీఎత్తున విజయాన్ని సొంతం చేసుకన్న వేళ.. ఆ ఊపులో ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్.. కేంద్రం మీద ఫైర్ కావటమే కాదు.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి షాకిస్తాయన్న మాటను చెప్పారు. ఆయన చెప్పినట్లే ఢిల్లీ ఫలితాలు రావటంతో.. అంచనా వేయటంలో కేసీఆర్ కు తిరుగులేదన్న విషయం మరోసారి నిరూపితమైందని చెప్పాలి.
జాతీయ రాజకీయాల మీద ఆసక్తి ఉన్న కేసీఆర్.. అందుకు తగ్గ ప్లానింగ్ ఇప్పటికే చేసి ఉండటం తెలిసిందే. అయితే.. అందుకు సరైన సమయం.. సందర్భం కోసం వెయిట్ చేస్తున్న ఆయన తాజాగా వెలువడిన ఢిల్లీ ఫలితం వేళ.. తాను సిద్ధం చేసిన ఫెడరల్ ఫ్రంట్ అస్త్రాన్ని తెర మీదకు మరోసారి తెస్తారన్న అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జట్టు కట్టటానికి ముందుగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకించే రాష్ట్ర ప్రభుత్వాల్ని జట్టు కట్టే వీలుందంటున్నారు.
ఇందులో భాగంగా భావసారుప్యత ఉన్న ముఖ్యమంత్రులతో ఒక సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించే అవకాశం ఉందంటున్నారు. దీనికి ప్రధాన ఆకర్షణగా కేసీఆర్.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అవుతారన్న మాట వినిపిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన ప్రభావాన్ని చూపించలేకపోవటం.. విపక్ష కాంగ్రెస్ తన ఉనికిని ప్రదర్శించటంలో ఫెయిల్ అవుతున్న వేళ.. రాజకీయ శూన్యత ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.
ఇలాంటివేళ.. ఫెడరల్ ఫ్రంట్ ను తెర మీదకు తీసుకొస్తే ప్రయోజనం ఉంటుందన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో టీఆర్ ఎస్ పార్టీని తిరుగులేని రీతిలో తయారు చేయటమే కాదు.. తన రాజకీయ వారసుడిగా కేటీఆర్ ను సిద్ధం చేసి.. ఎప్పుడైనా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోపెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతారు. తెలంగాణ రాష్ట్ర బాధ్యతను కొడుక్కి అప్పజెప్పి.. తాను జాతీయ రాజకీయ గోదాలోకి దూకితే మంచి పలితం వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది. దీనికి తాజాగా విడుదలైన ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కేసీఆర్ లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు. త్వరలోనే ఫెడరల్ ఫ్రంట్ పేరిట ముఖ్యమంత్రుల సమావేశానికి హైదరాబాద్ వేదికగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న మాట వినిపిస్తోంది.