Begin typing your search above and press return to search.

గడ్కరీకి కేసీఆర్ ఓపెన్ వార్నింగ్?

By:  Tupaki Desk   |   5 Jan 2016 4:57 AM GMT
గడ్కరీకి కేసీఆర్ ఓపెన్ వార్నింగ్?
X
రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కేంద్రం సాయం ఎంతో అవసరం. కొత్త ప్రాజెక్టుల వచ్చేందుకు కానీ. నిధులు భారీగా వెల్లువెత్తేందుకు కేంద్ర సర్కారు అందండలు అవసరం. అయితే.. తాను కోరుకున్నది సాధించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాస్త భిన్నంగా వ్యవహరిస్తుంటారు. బతిమిలాడటం.. ప్రాధేయపడటం లాంటివి ఆయనకు అస్సలు నచ్చవు. వరుస విజయాలతో మాంచి ఊపు మీదున్న ఆయన.. కేంద్రం సాయాన్ని డిమాండ్ చేసి మరీ సాధించుకోవాలన్నట్లుగా వ్యవహరించటం విశేషం.

నొప్పించకుండా పనులు చక్కదిద్దుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తుంటే.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ . తాజాగా యాదగిరి గుట్ట – వరంగల్ హైవే.. ముల్లకట్ల వద్ద గోదావరిపై నిర్మించిన బ్రిడ్జిలను కేంద్రమంత్రి గడ్కరితో కలిసి.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన హిందీలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని.. దక్షిణ భారతదేశంలోనే అతి తక్కువ జాతీయ రహదారులున్న రాష్ట్రంగా చెప్పుకున్న ఆయన.. తమకు కేంద్ర సాయం మరింత ఉండాలన్నారు. ఈ సందర్భంగా హెచ్చరిక ధోరణిలో వ్యాఖ్యలు చేయటం విశేషం. ఆదరించిన వారిని గుండెల్లో పెట్టుకొని పూజించటం.. వంచించిన వారిపై పోరాడి సాధించుకోవటం తెలంగాణ ప్రజల వ్యక్తిత్వమని.. అందుకే.. తెలంగాణకు మరింత సాయం చేయాలని కోరారు. కోరికలు కోరటంలో తప్పు లేదు. కానీ.. ఆ విషయాన్ని హెచ్చరిక ధోరణితో కాకుండా ‘ఈగో’ హర్ట్ కాకుండా వ్యాఖ్యలు చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి ఇలాంటి విషయాలు కేసీఆర్ కు తెలియనివి కావు. కానీ.. అలాంటి వ్యక్తి నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు వచ్చాయంటే.. కచ్ఛితంగా ఏదో ఒక వ్యూహం పక్కా అన్న అభిప్రాపయం వ్యక్తమవుతోంది.