Begin typing your search above and press return to search.
నయీం ఇష్యూలో ఓపెన్ అయిన కేసీఆర్
By: Tupaki Desk | 3 Oct 2016 5:37 AM GMTమానవ మృగంగా.. కసాయి డాన్ గా గుర్తింపు పొందిన నయీం ఇష్యూపై ఎంత చర్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఒక పెద్ద డాన్ చనిపోయిన తర్వాత కొంతకాలం వార్తలు రావటం మామూలే. అంతకు మించి అన్నట్లుగా..నయీం విషయంలో పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. నయీం ఎన్ కౌంటర్ జరిగి నెలలు గడుస్తున్నా.. అతనికి సంబంధించి కనీసం రెండు వార్తలైనా ఇప్పటికి ప్రతి మీడియా సంస్థ క్యారీ చేయటం కనిపిస్తుంది.
తీవ్రస్థాయిలో సంచలనం సృష్టించిన నయీం ఎన్ కౌంటర్ ముచ్చట మీద కానీ.. అతగాడి నేర చరిత్ర గురించి కానీ పెదవి విప్పని కేసీఆర్.. తాజాగా ఈ ఇష్యూ మీద ఓపెన్ కావటం ఆసక్తికరంగా మారింది. నయీం ఎన్ కౌంటర్.. తదనంతరం వెలుగులోకి వచ్చిన పరిణామాల మీద ఇప్పటివరకూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓపెన్ అయ్యింది లేదు. పార్టీ నేతల దగ్గర ఆ ముచ్చటే మాట్లాడింది లేదు. వన్ టు వన్ గా భేటీ అయినప్పుడు మాట్లాడినా.. మందితో కలిసి కూర్చున్నప్పుడు పెదవి విప్పింది ఆదివారమేనన్న విషయాన్ని మర్చిపోకూడదు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అన్ని జిల్లాలకు చెందిన మంత్రులు.. టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులతో విడివిడిగా భేటీ అయిన కేసీఆర్.. నల్గొండ జిల్లా నేతలతో సమావేశమైన సందర్భంగా నయీం వ్యవహారాన్ని ప్రస్తావించినట్లుగా చెబుతున్నారు. నయీంతో టీఆర్ ఎస్ నేతలకు మాత్రమే సంబంధం ఉన్నట్లుగా విపక్షాలు మాట్లాడుతున్నాయని.. మరి.. నయీంను పెంచి పోషించిన వాళ్ల ముచ్చటేందని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు. ‘‘మరి.. వాళ్ల సంగతేంది? వాళ్లు ఎటు పోవాలె?’’ అని వ్యాఖ్యానించటం ద్వారా.. నయీం వ్యవహారంలో అన్ని పార్టీల హస్తాన్ని ముఖ్యమంత్రి తన మాటలతో చెప్పకనే చెప్పేసినట్లైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/