Begin typing your search above and press return to search.
కీలక అధికారుల్ని పరుగులు పెట్టించిన కేసీఆర్
By: Tupaki Desk | 14 Feb 2018 5:35 AM GMTరాజు తలుచుకోవాలే కానీ వ్యవస్థలు పరుగులు తీయటం పెద్ద విషయమేమీ కాదు. గడిచిన కొద్దిరోజులుగా పంటి సమస్యతో పాలనకు దూరంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నట్లు చెబుతున్నారు. ఢిల్లీలో పంటి సర్జరీ చేయించుకున్న ఆయన ఇప్పుడా బాధ నుంచి విముక్తి అయినట్లుగా తెలుస్తోంది. వైద్యులు సూచించినట్లుగా విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్.. శస్త్రచికిత్స కారణంగా ఎలాంటి ఇబ్బంది లేకపోవటంతో పాలనా అంశాల మీద దృష్టి సారించినట్లు చెబుతున్నారు.
ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్న వాదన బలంగా ఉంది. విభజన సందర్భంగా రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు ఇప్పటివరకూ పూర్తి కాలేదని విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు రావాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.
తన ఆరోగ్య సమస్య ఒక కొలిక్కి రావటం.. ఢిల్లీలో ప్రధానిని కలుసుకునే అవకాశం ఉండటంతో.. తెలంగాణ రాష్ట్ర కీలక అధికారుల్ని ఈ రోజు (బుధవారం) ఉదయానికల్లా ఢిల్లీలో ఉండాలన్న కబురును పంపినట్లుగా తెలుస్తోంది. బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి అనుమతులతో పాటు.. న్యాయబద్ధంగా తెలంగాణకు కేంద్రం చేయాల్సిన పనులకు సంబంధించిన వివరాల్ని తీసుకొని ఢిల్లీకి రావాలంటూ సంబంధిత శాఖల అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లుగా చెబుతున్నారు. ప్రధాని మోడీ విదేశీ పర్యటనను ముగించుకొని వచ్చిన నేపథ్యంలో ఆయన టైం తమకు దొరికే అవకాశం ఉందన్న భావనలో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రుల్ని కలుసుకోవటంతో పాటు.. తెలంగాణ రాష్ట్ర డిమాండ్లను తెర మీదకు తీసుకురావాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లుగా చెబుతున్నారు. ఒకవేళ.. ప్రధాని టైం ఇవ్వని పక్షంలో కేంద్ర మంత్రుల్ని కలుసుకొని వారికి తెలంగాణకు కేంద్రం ఇవ్వాల్సిన అంశాల్ని చర్చిస్తారని చెబుతున్నారు. విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీల సాధన కోసం తమ ప్రభుత్వం ఎంత కమిట్ మెంట్ తో ఉందన్న విషయాన్ని తాజా ప్రోగ్రామ్ తో మరోసారి చాటి చెప్పే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నట్లుగా చెప్పక తప్పదు.