Begin typing your search above and press return to search.
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్
By: Tupaki Desk | 15 Jun 2020 4:00 PM GMTరైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రమంతా రైతాంగం నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు సిద్ధమైనందున వెంటనే రైతులందరికీ రైతుబంధు సాయం అందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సూచనల మేరకు నియంత్రిత పద్ధతిలోనే పంటల సాగుకు రాష్ట్రంలోని రైతులంతా అంగీకరించి దాని ప్రకారమే విత్తనాలు వేసుకోవడానికి సిద్ధం కావడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ప్రగతి భవన్ లో నియంత్రిత పంటల సాగు, రైతుబంధుపై కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
వానాకాలం మొదలైందని.. రైతులంతా పంట పెట్టుబడి డబ్బుల కోసం ఇబ్బంది పడవద్దని సీఎం అన్నారు. అందుకే వెంటనే రైతుబంధు సాయం విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. వారం పదిరోజుల్లోనే ఒక్క ఎకరాను మిగలకుండా.. ప్రతీ రైతుకు తెలంగాణలో రైతుబంధు సాయాన్ని బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలని సీఎం ఆదేశించారు.
అన్ని జిల్లాల్లో ప్రభుత్వం సూచించిన పంటల సాగునే రైతులు వేస్తున్నారని సీఎం కేసీఆర్ కు అధికారులు నివేదిక అందించారు. ఇప్పటికే 11 లక్షలఎకరాల్లో విత్తనాలు వేశారని తెలిపారు. వర్షాకాలంలో 60,16,079 ఎకరాల్లో పత్తిని, 41,76,778 ఎకరాల్లో వరిపంట, 12,31,284 ఎకరాల్లో కందులను, 4,68,216 ఎకరాల్లో సోయాబీన్ ను, 1,53,565 ఎకరాల్లో జొన్నలను, 1,88,466 ఎకరాల్లో పేసర్లను, 54,121 ఎకరాల్లో మినుములు, 92,994 ఎకరాల్లో ఆముదాలు, 41,667 ఎకరాల్లో వేరుశనగ , 67,438 ఎకరాల్లో చెరుకు, 54,353 ఎకరాల్లో ఇతర పంటలు పండిస్తున్నట్లు అధికారులు వివరించారు. మొత్తం 1,25,45,061 ఎకరాల్లో రైతులు నియంత్రిత పద్ధతిలో పంట సాగు విధానం అమలు చేయడానికి తెలంగాణ రైతాంగం సిద్ధం కావడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.