Begin typing your search above and press return to search.
కొడంగల్ లో వేలుపెట్టొద్దు..కేటీఆర్ కు బాస్ ఆర్డర్!
By: Tupaki Desk | 31 Oct 2017 4:16 AM GMTతెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు.. ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.. ప్రభుత్వానికి సంబంధించి అన్ని వ్యవహారాలు తానే అయి నడిపిస్తూ ఉంటాడని ప్రజలు అనుకుంటూ ఉంటారు. సాధారణంగా తెలంగాణ వ్యాప్తంగా ఏ శాఖకు సంబంధించిన కీలక పని అయినా, నిర్ణయం అయినా.. అందులో కేటీఆర్ జోక్యం ఉంటుందని కూడా వినిపిస్తూ ఉంటుంది. ఈ రకంగా తెలంగాణ పరిపాలన సకలం తన ద్వారా జరుగుతున్న భావనను ఆయన కలిగిస్తూ ఉంటారు. అయితే తాజాగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది ఏంటంటే.. కొడంగల్ విషయంలో మాత్రం జోక్యం చేసుకోవద్దంటూ కేటీఆర్ కు గులాబీ బాస్ సూచన చేసారుట. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో.. అక్కడి రాజకీయాల్ని తమ వైపు తిప్పుకోవడానికి గులాబీ పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే వాటిని పట్టించుకోవద్దని కేటీఆర్ కు పురమాయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కొడంగల్ లో ఇప్పటికే పలువురు తెలుగుదేశం కార్యకర్తలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలోనే ఈ చేరికలు కూడా జరిగాయి. ఆ రకంగా మంత్రి అక్కడ బాగా ఫోకస్ పెడుతున్నారు. పైగా కొత్తగా తెరాసలోకి వచ్చిన నాయకులు కొడంగల్ కు కేటీఆర్ ను ఆహ్వానించి ఓ భారీ బహిరంగ సభ నిర్వహించాలని అనుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. వారి తరఫున మంత్రి లక్ష్మారెడ్డి ఇందుకే కేటీఆర్ ను ఒప్పించే ప్రయత్నం కూడా జరిగినట్లు తెలుస్తోంది. కేటీఆర్ త్వరలో కొడంగల్ లో బహిరంగ సభ పెట్టడానికి కూడా సిద్ధ పడినట్లే గుసగుసలు వచ్చాయి.
అయితే.. తాజాగా వినిపిస్తున్న సంగతి ఏంటంటే.. కొడంగల్ వ్యవహారాలకు సంబంధించినంత వరకు వేలుపెట్టవద్దని, కేటీఆర్ ను కేసీఆర్ పురమాయించినట్లు తెలుస్తోంది. రేవంత్ వ్యవహారంపై దూకుడుగా కామెంట్లు చేయడం గానీ.. కొడంగల్ రాజకీయాల్లో తల దూర్చడం గానీ.. అక్కడ సభలు నిర్వహించడం గానీ వద్దని చెబుతున్నారుట.
ఆల్రెడీ.. కొడంగల్ లో ఉప ఎన్నిక వచ్చినట్లయితే.. ఆ స్థానంలో ఎట్ట పరిస్థితుల్లోనూ తెరాసను గెలిపించాల్సిన బాధ్యతను, అందుకు అనుగుణంగా వ్యూహరచన చేయాల్సిన బాధ్యతను కేసీఆర్ హరీష్ రావుకు అప్పగించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సమష్టిగా గెలుచుకోవాల్సిన సీటు విషయంలో కేటీఆర్ ను మాత్రం ఎందుకు దూరంపెడుతున్నారో అర్థం కావడం లేదని.. ఈ అంశంపై ఆయన ఇప్పటిదాకా పెద్దగా స్పందించడం లేదని పలువురు భావిస్తున్నారు.