Begin typing your search above and press return to search.
‘కొత్త జిల్లాల’ ఏర్పాటు అదిరిపోవాలట!
By: Tupaki Desk | 5 Oct 2016 4:47 AM GMTఅనుకున్నది అనుకున్నట్లుగా జరగాలనుకునే తత్వం అందరిలో ఉంటుంది. కానీ.. అదెంత కష్టమైనా.. ఎన్ని ఇబ్బందులైనా వెనక్కి తగ్గకుండా.. మొండిగా కూర్చొని పని చేయించుకోవటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. అలాంటి పనులు పూర్తి చేయించటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కున్న టాలెంటే వేరని చెప్పక తప్పదు. ఆయన ఏమైనా అనుకుంటే.. చేసేయగలరు. ఇలా చేయటం సాధ్యమేనా? అన్న ప్రశ్నకు సమాధానం వెతికే లోపే.. కేసీఆర్ నిర్ణయాల్ని తీసుకోవటమే కాదు.. వాటి అమలుకు అవసరమైన మార్గాల్ని వెతికే ప్రయత్నం చేస్తారు.
ముంగిట్లోకి కొత్త జిల్లాల యవ్వారం వచ్చిన వేళ.. ఇప్పటికి అనుకున్న జిల్లాలకు మరో నాలుగు జిల్లాల్ని కొత్తగా ఏర్పాటు చేయాలనుకోవటం.. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయటం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పక తప్పదు. పండుగ పూట అందరూ సంతోషంగా పండగ చేసుకోవాలే కానీ.. కొందరు ఇంట్లో కూర్చొని ఏడిస్తే.. అదేం పండగ అవుతుందంటూ చెప్పిన కేసీఆర్ మాటలు వింటేనే.. ఆయనేం కోరుకుంటున్నది ఇట్టే అర్థమవుతుంది.
కొత్త జిల్లాల అంశాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు గడిచిన కొద్ది రోజులుగా నాన్ స్టాప్ గా భేటీల మీద భేటీలు నిర్వహిస్తున్న కేసీఆర్.. ఆ పరంపరను మంగళవారం సైతం కొనసాగించారు. కొత్త జిల్లాల ఆరంభం అదిరిపోయేలా ఉండాలని.. పండుగ వేళ ధూంధాంగా కొత్త జిల్లాల ఏర్పాటు పండగను తలపించేలా ఉండాలని.. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని కేసీఆర్ అధికారుల్ని ఆదేశించారు. మొన్నటి వరకూ సిద్దిపేట జిల్లా ప్రారంభోత్సవంతో పాల్గొంటానని చెప్పిన ముఖ్యమంత్రి.. తాజాగా మెదక్ జిల్లా ఏర్పాటు కార్యక్రమంలో కూడా తాను పొల్గొంటానని వెల్లడించారు.
తనతోపాటు.. అసెంబ్లీ స్పీకర్.. మండలి ఛైర్మన్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. మంత్రులు.. కొత్త జిల్లాల్ని షురూ చేస్తారని.. ఇక.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు తమ పరిధిలో ఏర్పాటు చేసే రెవెన్యూ డివిజన్ ను ప్రారంభించనున్నట్లుగా వెల్లడించారు. ఎవరెవరు ఏయే కార్యాలయాల్ని ప్రారంభించాలన్న అంశానికి సంబంధించి ఒక స్పష్టమైన జాబితాను సిద్ధం చేయాలని కోరారు. కొత్తగా ఏర్పాటు అయ్యే జిల్లాలకు సంబంధించి జిల్లా ఏర్పాటైన రోజు నుంచే కలెక్టరేట్లు.. ఎస్పీ కార్యాలయాలు పని చేయాలని.. కొత్త మండలాల్లో కొత్త పోలీస్ స్టేషన్లు.. రెవెన్యూ కార్యాలయాల్ని స్టార్ట్ చేయాలని.. వీలైనంతవరకూ ప్రతి రెవెన్యూ డివిజన్ లో ఆర్డీవోతో పాటు డీఎస్పీ అధికారి కూడా ఉండాలని కోరటం గమనార్హం.
మొత్తంగా చూస్తే.. పేరుకు కొత్త జిల్లాలే కానీ.. వ్యవస్థ మాత్రం పాత జిల్లాల్లో ఎలా అయితే పని చేసుకుంటూ పోతుందో.. అదే తీరులో ఉండాలన్నది కేసీఆర్ ఆకాంక్షగా చెప్పొచ్చు. సమయం తక్కువగా ఉన్న వేళ.. ఆయన కోరుకుంటున్న పనులన్ని జరిగిపోతాయా? అన్నదే పెద్ద ప్రశ్న. ఎందుకంటే.. కొత్త జిల్లాలపై రెండు రోజుల క్రితమే తీసుకున్న కొత్త నిర్ణయాలు.. అదే విధంగా రెవెన్యూ డివిజన్లపై ఉన్న కన్ఫ్యూజన్ ఇప్పటికీ ఒక కొలిక్కి రాని వేళ.. సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కోరుకున్నట్లు జరుగుతుందా? అన్నది సందేహమే. అయితే.. యుద్ధప్రాతిపదికన పనులు చేయించటంలో దిట్ట అయిన కేసీఆర్.. ఆయన అనుకున్నట్లే అన్ని చేయిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు అధికారపక్ష నేతలు. అదెంత వరకూ నిజమన్నది కాలమే నిర్ణయించాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/