Begin typing your search above and press return to search.
గవర్నర్ వేదిక సాక్షిగా కేసీఆర్-పవన్ ప్రత్యేక ముచ్చట్లు
By: Tupaki Desk | 26 Jan 2019 3:14 PM GMTగణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం అనేక ఆసక్తికర పరిణామాలకు వేదికగా మారింది. గవర్నర్ దంపతులు నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు - వైసీపీ అధినేత వైఎస్ జగన్ - జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ - తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం పంపారు. అయితే - గవర్నర్ ఇచ్చిన తేనీటి విందుకు కేసీఆర్ - పవన్ కల్యాణ్ - తెలంగాణ కాంగ్రెస్ నేతలు హాజరుకాగా ఏపీ సీఎం చంద్రబాబు దూరంగా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన ఈ తేనీటి విందులో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే నేతలు ఆత్మీయంగా పలకరించుకున్నారు. సీఎల్పీ మాజీ నేత - సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దీంతోపాటుగా తెలంగాణ సీఎం కేసీఆర్ - జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య ఆసక్తికరమైన చర్చలు జరిగాయి. ఓవైపు పవన్ కల్యాణ్ - కేటీఆర్ మధ్య ముచ్చట్లు - ఆ వెంటనే పవన్ కల్యాణ్ - కేసీఆర్ మధ్య చర్చలు జరిగాయి.
కాగా, ఏపీలోని రాజకీయ పరిస్థితులపై గులాబీ దళపతి - జనసేనాని మధ్య చర్చలు కొనసాగాయని పలువురు అంచనావేస్తున్నారు. ఈ సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్ లో వైఎస్ జగన్ పై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. కేటీఆర్ -జగన్ భేటీపై కూడా పవన్ కల్యాణ్ కామెంట్ చేసినట్టు సమాచారం. మొత్తంగా ఏపీ - తెలంగాణ నేతలు ఈ ఎట్ హోం కార్యక్రమానికి హాజరుకాగా విందు సమావేశం కాస్త రాజకీయ చర్చల వేదికైందని పలువురు చర్చించుకుంటున్నారు.