Begin typing your search above and press return to search.

కేసీఆర్ పెంపుడు కుక్క మృతి కేసు.. కీలక మలుపు

By:  Tupaki Desk   |   26 Nov 2019 5:19 AM GMT
కేసీఆర్ పెంపుడు కుక్క మృతి కేసు.. కీలక మలుపు
X
తెలంగాణలో డెంగ్యూ తో చాలా మంది చనిపోయారు.. పట్టించుకోలేదు. ఇక ఆర్టీసీ సమ్మె పరిష్కారం కావడం లేదని 30 మంది వరకూ కార్మికులు ఉసురు తీసుకున్నారు.. అదేదో పెద్ద విషయం కాలేదు ప్రభుత్వ పెద్దలకు, అధికార యంత్రాగానికి.. కానీ కేసీఆర్ పెంపుడు కుక్క చనిపోతే మాత్రం వేగంగా స్పందించారు. దానికి చికిత్స అందించడంలో విఫలమైన ఇద్దరు పశువైద్యాధికారులపై కేసులు పెట్టారు. ఇలా తెలంగాణలో మనుషులు చనిపోతేనే దిక్కులేదు.. కానీ రాజా వారి కుక్క చావు మాత్రం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. సీఎం కేసీఆర్ పెంపుడు కుక్క ‘హస్కీ’ మరణం ఆ మధ్య చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే..

సీఎం కేసీఆర్ పెంపుడు కుక్క 2019, సెప్టెంబర్ 10 చనిపోయింది. కేసీఆర్ నివాసం ప్రగతి భవన్ లో ఉండే హస్కీ అనే కుక్క అనారోగ్యానికి గురికావడంతో దాన్ని బంజారాహిల్స్ లోని పెట్ క్లినిక్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కుక్క చనిపోయింది. దీనికి పశువైద్యాధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ ప్రగతి భవన్ అధికారులు నాడు పోలీసుల కు ఫిర్యాదు చేశారు. పోలీసులు పశు వైద్యాధికారులు డాక్టర్ రంజిత్, లక్ష్మీల పై కేసులు నమోదు చేశారు.

ఈ వ్యవహారం తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా దుమారం రేపింది. కేసీఆర్ పెంపుడు కుక్కకు ఉన్న విలువ తెలంగాణలో ప్రజలకు లేదు అంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇక పశువైద్యాధికారులపై కేసులు పెట్టడాన్ని ఇండియన్ వెటర్నరీ అసోసియేషన్ కూడా తప్పు పట్టింది. సీఎం కేసీఆర్ ను ఈ కేసులు ఎత్తి వేయాలని ఇండియన్ వెటర్నరీ అసోసియేషన్ లేఖ రాసింది.

ఇక పెంపుడు కుక్క పోస్టుమార్టం రిపోర్ట్ లో కూడా అది సహజంగానే అనారోగ్యంతో చనిపోయిందని వైద్యుల నిర్లక్ష్యం లేదని తేలింది. దీంతో కేసీఆర్ పెంపుడు కుక్క మృతి కేసు కీలక మలుపు తిరిగింది.

పశు వైద్యాధికారుల పై పెట్టిన కేసు ను మూసి వేయాలని సిటీ పోలీసులు స్థానిక కోర్టులో పిటీషన్ సమర్పించారు. ఇలా కేసీఆర్ పెంపుడు కుక్క వ్యవహారం చివరకు ఎటువంటి వివాదం లేకుండా ముగిసి పోయింది.