Begin typing your search above and press return to search.
మునుగోడు గెలిచేదైతే కేటీఆర్ కు.. ఓడేదైతే హరీష్ కు..?
By: Tupaki Desk | 10 Aug 2022 12:30 AM GMTతెలంగాణ సీఎం కేసీఆర్ ఏది చేసినా దానికో అర్థం పరమార్థం ఉంటుంది. తెలంగాణలో బీజేపీ తీసుకొచ్చిన మరో ఉప ఎన్నికను ఆయన పిచ్చ లైట్ తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. మునుగోడులో రాజీనామా చేయించి బీజేపీ పెద్ద తప్పు చేసిందని.. వారి గోతిలో వారే పడుతారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
ఏ ఉప ఎన్నికనైనా.. గెలిచేది అయితే కేటీఆర్ చేతుల్లో పెట్టడం.. ఓడేది అయితే మంత్రి హరీష్ రావు ఖాతాలో జమచేయడం కేసీఆర్ కు అలవాటు. దుబ్బాక, హుజూరాబాద్ లో గెలవడం కష్టం అని ఆ బాధ్యతలను మంత్రి హరీష్ రావు కు అప్పగించాడు కేసీఆర్.
ఇక గతంలో గెలిచే హుజూర్ నగర్, నాగార్జునసాగర్ లను కొడుకు కేటీఆర్ చేతుల్లో పెట్టాడు. అక్కడ టీఆర్ఎస్ గెలవడంతో కేటీఆర్ ను భవిష్యత్ నాయకుడిగా కేసీఆర్ ఫోకస్ చేశారు.
ఇప్పుడు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి అంత ధీమాతో బీజేపీలో చేరి ఉప ఎన్నికలకు సై అంటున్నారు. కానీ మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలవడని కేసీఆర్ అంటున్నారు. ఆగమాగం కావద్దని.. ప్రశాంతంగా మునుగోడులో పోటీచేసి గెలుద్దామని ఇటీవల నేతలతో అన్నారట..
దీన్ని బట్టి గెలిచేదైతే కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. మరోసారి సర్వే చేయించి ఓడితే హరీష్ కే బాధ్యతలు ఇస్తారని సమాచారం. నిజానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నప్పుడు అన్ని ఎన్నికలకు ఆయనే బాధ్యత వహించాలి. కానీ కేటీఆర్ ను భావి సీఎం చేయాలనుకుంటున్న కేసీఆర్.. ఓడిపోతే ప్రతిష్ట దెబ్బతింటుందని అల్లుడు హరీష్ ఖాతాలో దాన్ని వేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం మునుగోడులో కేసీఆర్ ధైర్యం ఏంటో అర్థం కావడం లేదట.. కోమటిరెడ్డిని ఓడించడం కష్టం అని అనుకునే తరుణంలో కొడుకు నెత్తిన ఇన్ చార్జి బాధ్యత పెట్టి.. ఆయన ఖాతాలో ఓ వైఫల్యాన్ని వేయడానికి దళపతి సిద్ధమేనా? అన్నది ప్రశ్నార్థకం. మునుగోడు వ్యూహాలు ముందు ముందు ఎలా సాగుతున్నాయన్నది వేచిచూడాలి.