Begin typing your search above and press return to search.

కేసీఆర్ ప్లాన్: రాష్ట్రానికి కేటీఆర్, దేశానికి కవిత

By:  Tupaki Desk   |   11 Dec 2019 4:40 AM GMT
కేసీఆర్ ప్లాన్: రాష్ట్రానికి కేటీఆర్, దేశానికి కవిత
X
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ కే కేశవరావు పదవీకాలం ముగియబోతోంది. ఇప్పటికే 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కేసీఆర్ సీనియర్ల కు మంగళం పాడారు. తనతోపాటు ఉద్యమకాలం నుంచి ఉన్న నాయిని నర్సింహారెడ్డి, కడియం శ్రీహరి ఇతర సీనియర్లకు రెస్ట్ ఇచ్చారు. ఇప్పుడు కేకేను కూడా రాష్ట్ర రాజకీయాల్లో వాడుకోవాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తన పక్కనే తన తోపాటు పాలిటిక్స్ లో భాగం చేసుకోవాలని.. కేకేను పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వ, పార్టీలకు ఉపయోగించుకోవాలని కేసీఆర్ యోచిస్తున్నారట.

ప్రస్తుతం ఢిల్లీలో టీఆర్ఎస్ లోక్ సభ శాసనసభా పక్ష నేతగా టీడీపీ నుంచి అరువు వచ్చి ఖమ్మం ఎంపీగా గెలిచిన నామా నాగేశ్వరరావు ఉన్నారు. గులాబీ ఎంపీల్లో ఆ స్థాయి నేత లేకపోవడం కవిత, వినోద్ లాంటి వారు ఓడిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నామాను టీఆర్ఎస్ పక్ష నేతగా చేయాల్సి వచ్చింది.

టీఆర్ఎస్ పార్టీని ఇప్పటికే తన కుమారుడు కేటీఆర్ కు అప్పగించిన కేసీఆర్.. ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ ను కూతురుకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. ఇతర నేతలపై నమ్మకం లేకనే కేసీఆర్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. గులాబీ పార్టీ తన కుటుంబం ముద్ర ఉండడానికే కవితను మళ్లీ జాతీయపాలిటిక్స్ లో యాక్టివ్ చేయబోతున్నారట..

కవితను త్వరలోనే రాజ్యసభ ఎంపీని చేయబోతున్నట్టు తెలిసింది. నిజామాబాద్ లో ఓడిపోయాక కవిత పాలిటిక్స్ లో సైలెంట్ అయ్యారు. దారుణ పరాభవం నుంచి కోలుకో లేకపోతున్నారు. బయట కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. బతుకమ్మ ఉత్సవాలకు కూడా దూరంగా జరిగారు. ఆ నేపథ్యం లోనే కవిత ను రాజ్యసభ ఎంపీగా పంపి మళ్లీ యాక్టివ్ చేయాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలిసింది.

ఇప్పటికే తనకు సన్నిహితుడైన కరీంనగర్ ఎంపీగా ఓడిన వినోద్ కు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చేసి రాజకీయ ఆశ్రయం కల్పించిన కేసీఆర్.. ఇప్పుడు తన కూతురుకు జాతీయ స్థాయిలో గులాబీ పార్టీ పగ్గాలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. మరి కేకే స్థానంలో రాజ్యసభకు పంపిస్తారా? లేక కేకేను అలానే ఉంచి రాజ్యసభకు నామినేట్ చేస్తారా అన్నది వేచిచూడాలి.