Begin typing your search above and press return to search.
బీజేపీకి కూసాలు కదిలేలా కేసీఆర్ ప్లానింగ్
By: Tupaki Desk | 1 Oct 2021 1:30 PM GMTఅన్ని ఉప ఎన్నికలు ఒకేలా ఉండవు. ఈ విషయాన్ని కేసీఆర్ రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతుంది. ఉప ఎన్నికల ఫలితాలు ఏవైనా అధికారపక్షానికి అనుకూలంగా ఉంటాయన్న విషయాన్ని తప్పని రుజువు చేసిన సత్తా కేసీఆర్ సొంతం. విపక్షంలో ఉన్నప్పుడే ఇలాంటి మేజిక్ లు చేసిన ఆయన.. చేతిలో అధికారాన్ని ఉంచుకున్న వేళ.. తెలంగాణలో తనకు మించిన ప్రత్యామ్నాయం లేదన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. వచ్చిన హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు కేసీఆర్.
తనకు సుదీర్ఘకాలం మిత్రుడిగా ఉండి.. రాజకీయ ప్రయాణంలో తనతో పాటు ప్రయాణించిన ఈటల రాజేందర్ ను తొలిసారి ప్రత్యర్థి హోదాలో ఎదుర్కోనున్నారు. తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ కీలకమే అయినప్పటికీ.. దానికి చోదక శక్తిగా వ్యవహరించింది ఈటల లాంటి తెలంగాణ వాదులని చెప్పాలి. ఎంత కేసీఆర్ నాయకత్వం బాగున్నా.. తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న వైఎస్ హయాంలో.. అసెంబ్లీలో తెలంగాణ వాణిని బలంగా వినిపించటమే కాదు.. ఏపీకి చెందిన నేతలు సైతం తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని లోగుట్టుగా ‘ఓకే’ అనిపించేలా చేయటంలో ఈటల రాజేందర్ వాణిని తక్కువ చేసి చూపలేం.
అంతదాకా ఎందుకు కేసీఆర్ స్వయంగా పలు సందర్భాల్లో ఈటల ప్రస్తావన తెచ్చి.. మా రాజేందర్ ను సమైక్యపాలకులు ఎన్నేసి మాటలు అన్నారంటూ విరుచుకుపడటాన్ని మర్చిపోగలమా? అలాంటి రాజేందర్ ఓటమే తన లక్ష్యంగా కేసీఆర్ ఉన్నారు. ఏం చేసైనా సరే.. రాజేందర్ ఓటమితో తెలంగాణలో తనకు తిరుగులేదన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. లెక్క కాస్త తేడా కొడుతుందన్న సందేహం వచ్చినంతనే.. కనిపించకుండా పోయి.. కామ్ గా ఉండే కేసీఆర్ లాంటి అధినేత.. తాజా ఉప ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వస్తానని చెప్పటం చూస్తే.. హుజూరాబాద్ గెలుపు మీద ఆయన ఎంత కచ్ఛితంగా ఉన్నారన్నది అర్థమవుతుంది.
ఈటల రాజేందర్ రాజీనామాకు కాస్త ముందే.. తన శక్తుల్ని హుజూరాబాద్ లో మొహరించిన కేసీఆర్.. తనకు అవసరమైన సానుకూల వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు వీలుగా.. పెద్ద బ్యాచ్ ను దింపి.. అక్కడ గ్రౌండ్ వర్కు చేశారని చెబుతారు. వారు ఇచ్చిన సమాచారంతో పాటు.. నిఘా వర్గాలు.. తాను చేయించిన సర్వే రిపోర్టలను క్రోడికరించిన తర్వాతే ఉప ఎన్నికల్లో గెలుపు పక్కా అన్న నమ్మకం ఆయనకు వచ్చినట్లు చెబుతున్నారు. గెలుపు తథ్యమన్న విషయాన్ని గుర్తించి.. మరింత కష్టపడాలన్న సంకేతాల్ని ఇప్పటికే నేతలకు.. క్యాడర్ కు పంపిన ఆయన.. దుబ్బాక ఉప ఎన్నికను పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ హెచ్చరిస్తున్నట్లు చెబుతున్నారు.
గెలుపు ధీమాతో ఉదాసీనత వస్తుందన్న ఆలోచనతో ఉన్న ఆయన.. అలాంటిదేమీ లేకుండా ఉండేందుకు వీలుగా ఉప ఎన్నిక ఒక కొలిక్కి వచ్చే లోపు.. తన ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీకి షాకులు ఇచ్చేలా ప్లానింగ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీ నేతల్ని.. కార్యకర్తల్ని టార్గెట్ చేసిన టీఆర్ఎస్.. రాబోయే రోజుల్లో బీజేపీకి చెందిన కొందరు ముఖ్యుల్ని పార్టీలోకి తీసుకురావటం ద్వారా దిమ్మ తిరిగేలా షాకివ్వాలని భావిస్తున్నారు. అంతేకాదు.. కీలక ఉప ఎన్నికకు ముందు నైతికస్థైర్యాన్ని దెబ్బ తీసేలా కేసీఆర్ కార్యాచరణ ఉంటుందంటున్నారు. దాంతో కమలనాథుల కూసాలు కదిలేలా ఆయన షాక్ ఉంటుందన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే.. ఈటలకు మరిన్ని తిప్పలు తప్పవన్న మాట వినిపిస్తోంది.