Begin typing your search above and press return to search.
కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ విశాఖ నుంచే మొదలా.?
By: Tupaki Desk | 29 Jan 2019 9:00 AM GMTగత నెల్లో రాజశ్యామల యాగం పూర్తైన తర్వాత విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిని కలిసేందుకు విశాఖ వెళ్లారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఆ తర్వాత అక్కడ నుంచి ఒడిశా వెళ్లిపోయారు. అయితే.. కేసీఆర్ విశాఖ వస్తున్నారని తెలిసి.. అక్కడి ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ప్రజలు రెస్పాన్స్ చూసి కేసీఆరే ఆశ్చర్యపోయారంటే.. జనం ఏ రేంజ్‌లో వచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మరోసారి కేసీఆర్ విశాఖ రాబోతున్నారు. ఫిబ్రవరి 14న శారదా పీఠంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది. దీనికి కేసీఆర్ ని స్వరూపానంద ఆహ్వానించారు. స్వామి అహ్వానం మేరకు విశాఖ వచ్చేందుకు నిర్ణయించుకున్నారు కేసీఆర్.
ఎన్నికలు పూర్తైన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ కచ్చితంగా ఇవ్వాల్సిందేనని అన్నారు కేసీఆర్. ఏపీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ జోక్యం కచ్చితంగా ఉంటుందని చెప్పేశారు. అందుకు తగ్గట్లుగానే మొన్న సంక్రాంతికి తలసాని యాదవ్ విజయవాడ వెళ్లినప్పుడు భారీ ర్యాలీ తీశారు. ఇప్పుడు కేసీఆర్ కూడా వచ్చే నెల్లో విశాఖ వెళ్తున్నారు. దీంతో.. విశాఖలో కేసీఆర్ రేంజ్ కు తగ్గట్లుగా భారీ ర్యాలీ ఉండేలా ప్లాన్ చేయబోతున్నారట. దీంతోనే.. చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టాలని అనుకుంటున్నారట.