Begin typing your search above and press return to search.
ఆర్టీసీ కండక్టర్ మీద కేసీఆర్ దెబ్బ పడినట్లే
By: Tupaki Desk | 5 July 2016 5:16 AM GMTఏదైనా అంశం మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కన్ను పడితే.. దాని అంతు చూసే వరకూ విడిచిపెట్టరు. ఆయనకు తెలీని ఏదైనా అంశం కనిపించటం ఆలస్యం దాని మీద ఆయన అధ్యయనం మొదలవుతుంది. అదెంత వరకూ సాగుతుందంటే.. ఆ రంగంలో మొనగాడు లాంటి వారికి తెలిసిన చాలా అంశాలపై ప్రాధమిక అవగాహన పెంచుకునే వరకు ఆయన వెళతారు. అందుకు స్వల్ప వ్యవధి మాత్రమే తీసుకుంటారు. అలా అవగాహన పెంచుకున్న తర్వాత.. సమస్యను సమస్యగా చూస్తే.. దాని పరిష్కారానికి ఎంతటి కఠిన నిర్ణయం తీసుకోవటానికైనా వెనుకాడరు.
తాజాగా అలాంటి నిర్ణయాన్నే తెలంగాణ సర్కారు తీసుకుంది. ఇటీవల కాలంలో ఆర్టీసీ మీద.. దాని నష్టాల మీద దృష్టి పెట్టిన కేసీఆర్.. దాని సంగతి తేల్చే పని మీద పడ్డారు. ఇందులో భాగంగా తాజాగా తీసుకున్ననిర్ణయం ఒకటిగా చెప్పొచ్చు. ప్రస్తుతం దూర ప్రాంత సర్వీసులకు.. ఒకమోస్తరు దూరాలకు సంబంధించిన సర్వీసుల్లో కండక్టర్లు లేకుండా డ్రైవర్లే టిమ్ మిషన్ల సాయంతో టిక్కెట్లను కొట్టే పని చేస్తుండటం తెలిసిందే. అయితే.. ఈ విధానాన్ని పల్లెవెలుగు సర్వీసులకు వరకూ విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఆర్టీసీలో కండక్టర్లకు స్వస్తి పలికే ఆలోచన చేస్తోంది.
ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోవటం.. ఇటీవల పెంచిన జీతాల కారణంగా ఆర్టీసీ మీద భారం మరింత పెరిగిన నేపథ్యంలో.. కండక్టర్లను తగ్గించుకోవటం ద్వారా నష్టాల్ని తగ్గించుకోవచ్చన్న ఆలోచన ఆర్టీసీ చేస్తుంది. ఇప్పటికే కండక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న వారికి ఉద్యోగ భద్రతకు సంబంధించి ఎలాంటి ప్రమాదం లేకున్నా.. గత కొద్ది కాలంగా నిలిపివేసిన కండక్టర్ల నియామకంపై శాశ్వితంగా నిలిపివేసేలా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
గత కొద్ది కాలంగా కండక్టర్ల నియమకాల్ని నిలిపివేశారు. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం భవిష్యత్తులో కండక్టర్ల నియమకాలు పూర్తిగా నిలిపివేస్తారు. ఇప్పటికే ఉన్న కండక్టర్లకు వేర్వేరు పనులకు వినియోగించే అవకాశం ఉంది. తాజాగా తెలంగాణఆర్టీసీ కొత్తగా 1200 బస్సులను కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో.. కొత్తగా వచ్చే బస్సులన్నింటికి డ్రైవర్ కండక్టర్ పని చేసేలా నిర్ణయం తీసుకోనున్నారు. అత్యాధునిక పద్ధతిలో ఆర్టీసీ బస్సుల్లో టికెటింగ్ విధానాన్ని అమలు చేసే ఆలోచనలో తెలంగాణ సర్కారు ఉంది. మొత్తంగా ఆర్టీసీ కండక్టర్లకు గడ్డు కాలం మొదలైనట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.