Begin typing your search above and press return to search.
గుత్తాకు ఎమ్మెల్సీ...ఉప ఎన్నికకు రెడీ
By: Tupaki Desk | 4 March 2017 3:03 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో వ్యూహానికి శ్రీకారం చుట్టారా? కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ లో చేరిన ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టనున్నారా? అనంతరం ఎన్నికలకు వెళ్లి కాంగ్రెస్ పార్టీకి కొద్దొగొప్పో పట్టున్న నల్లగొండలో టీఆర్ ఎస్ సత్తాను చాటనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం టీఆర్ ఎస్ అధినాయకత్వం నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డిని శాసనమండలికి పంపించాలని యోచిస్తోంది. పెద్దల సభలోకి పంపించిన తర్వాత గుత్తా ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ లోక్ సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో మరోసారి ప్రభుత్వ ప్రజాదరణను నిరూపించుకోవాలని టీఆర్ ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ శాసనమండలిలోని ఎమ్మెల్యే కోటాలో ఖాళీకానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 19న ఎన్నికలు జరగనున్నాయి. అందులో ప్రస్తుతం టీఆర్ ఎస్ - ఎంఐఎం - కాంగ్రెస్ పార్టీలు ఒక్కో స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఎంఐఎంకు ఇప్పటికే హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా కింద ఒక ఎమ్మెల్సీ స్థానం కేటాయించినందున, ఎమ్మెల్సీ కోటా కింది ఖాళీ అవుతున్న ఎంఐఎం స్థానాన్ని ఆ పార్టీకి కేటాయించే అవకాశం లేనట్లు తెలిసింది. అదే సమయంలో మూడు స్థానాలను గెలుచుకునేందుకు అవసరమైన సంఖ్యా బలం టీఆర్ ఎస్ కు ఉంది. ఈ స్థానాల నుండి గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. పార్టీ మారిన ఎంపీలు మరొకరు ఉన్నప్పటికీ గుత్తానే రంగంలోకి దించడం వెనుక కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు చెప్తున్నారు.
గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ పార్లమెంటు స్థానం పరిధిలోనే పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి - ఆయన సతీమణి పద్మావతి - ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి - కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించాలని ఆశిస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ లు ఉన్నాయి. దీంతో అక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తే కాంగ్రెస్ - టీఆర్ ఎస్ బలాబలాలు ఎంతో తేలుతుందని గులాబీ దళపతి కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాల తర్వాత గుత్తాతో రాజీనామా చేయించనున్నట్లు సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/