Begin typing your search above and press return to search.

ఆఫీస్ ఆఫ్ కేసీఆర్‌... కేరాఫ్ ఢిల్లీ !

By:  Tupaki Desk   |   1 May 2018 10:56 AM GMT
ఆఫీస్ ఆఫ్ కేసీఆర్‌... కేరాఫ్ ఢిల్లీ  !
X
దేనికైనా బ‌జ్ క్రియేట్ చేయ‌డంలో కేసీఆర్ బాగా ప‌నికొస్తారు. కాక‌పోతే ఆయ‌న ఖ్యాతి ఇంకా జాతీయ మీడియాకు ఎక్క‌లేదు. బ‌ట్ తెలుగు మీడియాకు మాత్రం ఎపుడూ కింగే! కేసీఆర్ ఉద్దేశం ఏంట‌నేది ప‌క్క‌న పెడితే ఎలాగైనా జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని కొంత‌కాలంగా ఆయ‌న ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తామ‌ని ప్ర‌క‌టించిన నాటి నుంచి మీడియాతో మాట్లాడిన ప్ర‌తిసారీ ఆయ‌న నేష‌న‌ల్ పాలిటిక్స్‌ను మ‌రిచిపోలేదు. ఎపుడూ దాని గురించి కొత్త క‌బుర్లు చెప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. చివ‌ర‌కు పార్టీకి కీల‌క స‌మావేశ‌మైన ప్లీన‌రీలోనూ అదే ప్ర‌ధానాంశం.

ఇక కేసీఆర్ ల‌క్ష్యం ఏమై ఉంటుంది? అన్న ప్ర‌శ్న‌కు అనేక ర‌కాల విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. వార‌సుడి భ‌విష్య‌త్తును మ‌రింత దృఢంగా నిర్మించ‌డ‌మూ, త‌న టాలెంట్‌ ను జాతీయ స్థాయిలో ప్ర‌ద‌ర్శించ‌డం కేసీఆర్ ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. చంద్ర‌బాబుతో పాటు వైఎస్ త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన జ‌గ‌న్ కూడా జాతీయ స్థాయిలో హైలెట్ అవుతున్నారు కానీ కేసీఆర్ మాత్రం పెద్ద‌గా క‌న‌ప‌డ‌రు. ఇది కేసీఆర్‌కు న‌చ్చ‌లేదు. అందుకే జాతీయ స్థాయిలో ఏకంగా భారీ అడుగు వేశారు. ఇంత‌వ‌ర‌కూ అన్ని సార్లూ ఫెయిలైన థ‌ర్డ్ ఫ్రంట్‌ ను తాను నిర్మిస్తాన‌ని ప్ర‌క‌టించారు. అయితే, అది థ‌ర్ట్ ఫ్రంట్ కాదు, ప్ర‌జా ఫ్రంట్‌... జాతీయ పార్టీల‌కు బుద్ధి చెప్పే ప్రాంతీయ పార్టీల ఫ్రంట్ అని కేసీఆర్ చెబుతున్నారు.

కేసీఆర్ గ‌ట్టి ప్ర‌య‌త్నాలు అయితే చేస్తున్నారు కానీ రిజ‌ల్ట్ మాత్రం పెద్ద‌గా క‌న‌ప‌డ‌టం లేదు. ఇప్ప‌టికే ప‌శ్చిమ‌బెంగాల్‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు త‌దిత‌ర నేత‌ల‌ను క‌లిసిన కేసీఆర్ మిగ‌తా రాష్ట్రాల ముఖ్యుల‌ను కూడా క‌ల‌వ‌నున్నారు. అయితే, ఆయా రాష్ట్రాల‌కు వెళ్లి క‌ల‌వ‌డం కంటే... ఢిల్లీ కేంద్రం రాజ‌కీయాలు చేయ‌డం వ‌ల్ల ఎక్కువగా జాతీయ మీడియా క‌ళ్ల‌లో ప‌డొచ్చ‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ట‌. అందుకే త‌న ప్ర‌జా ఫ్రంట్‌ కు అక్క‌డో ఆఫీసు పెట్టి మ‌రీ ఢిల్లీ రాజ‌కీయాలు ముందుకు తీసుకెళ్లాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఢిల్లీలో కేసీఆర్ ఆఫీసు పెడితే మ‌రి ఇప్ప‌టికే స‌చివాల‌యానికి ఫాంహౌస్ కంటే త‌క్కువ టైం కేటాయిస్తున్న కేసీఆర్‌... ఢిల్లీ ఆఫీస్‌కు ఎలా టైం కేటాయిస్తారో మ‌రి!

కొస‌మెరుపు - కేసీఆర్ త‌న ప్ర‌జా ఫ్రంట్ అజెండా *రైతు బాగుండాలి-దేశం బాగుండాలి* మొన్న‌టి ప్లీన‌రీలో తెలిసింది. దేశంలోని ప్ర‌తి ఎక‌రాకు సాగు నీరు అందించ‌డం అనే ఒక ఆస‌క్తిక‌ర‌మైన మాట‌తో ఆయ‌న నినాదం కూర్చ‌డం బాగానే ఆక‌ర్షించింది. అందుకే దానిని మ‌రోసారి చెప్ప‌డానికి రాష్ట్రంలో ప్ర‌వేశ పెడుతున్న రైతు బంధు ప‌థ‌కం ప్రారంభోత్స‌వానికి ఇత‌ర ముఖ్య‌మంత్రులు ప‌లువురిని ఆహ్వానిస్తున్నార‌ట కేసీఆర్‌.