Begin typing your search above and press return to search.

ద‌ళిత కీర్త‌న‌లో కేసీఆర్ ముందంజ ! రాహులో రాహులా !

By:  Tupaki Desk   |   19 Feb 2022 5:31 AM GMT
ద‌ళిత కీర్త‌న‌లో కేసీఆర్ ముందంజ ! రాహులో రాహులా  !
X
ద‌ళిత కీర్త‌న‌లో కేసీఆర్ ముందంజ‌లో ఉన్నారు. ఆ కీర్త‌న‌కు ఆలాప‌న‌కు కేసీఆర్ ఎప్పుడో ప‌ల్ల‌వి రాసేశారు. చ‌ర‌ణాలు రాసే ప‌నిలో అయితే రాహుల్ కానీ లేదా మోడీ కానీ ఉండాలి. ఎందుకంటే నిన్న‌టి వేళ సంత్ రవి కాంత్ ఆల‌యానికి వెళ్లి, దళిత జీవితాల‌ను ప్ర‌భావితం చేసిన స్వామీజీ గురించి మ‌రికొంత సవిన‌య పూర్వ‌కంగా విని, వాళ్ల‌తో మాట్లాడి వ‌చ్చిన మోడీతో పాటు సంత్ ర‌విదాస్ భ‌క్తుల‌కు ప్ర‌సాదం వ‌డ్డించి వ‌చ్చిన రాహుల్ కూడా నేర్చుకోవాల్సింది ఎంతో!

ఎందుకంటే ఉత్త‌ర ప్ర‌దేశ్ ద‌ళితులు,తెలంగాణ ద‌ళితులు వేరు కాకున్నా ఉద్వేగాల రీత్యా వారు వేర్వేరు. రాజకీయం రెండు ప్రాంతాల‌లో ఉన్న చైత‌న్యం నిండిన రాజ‌కీయం ఉత్త‌రాదిలోనే అధికంగా ఉంద‌ని తేలిపోయింది. క‌నుక కేసీఆర్ త‌న‌దైన శైలిలో ద‌ళిత బంధు ప‌థ‌కం ఒక‌టి ప్ర‌క‌టించారు. కానీ ఇదే స‌మ‌యంలోరాహుల్ కానీ మోడీ కానీ ఉచిత ప‌థ‌కాలు ముఖ్యంగా ద‌ళితుల కోసం ఉచిత ప‌థ‌కాలు అంటూ చెప్పుకోద‌గ్గ రీతిలో ఏవీ ప్ర‌క‌టించ‌లేదు.

అంటే జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల క‌న్నా డ‌బ్బులు పంచ‌డంలో కాస్త హుందాగానే ఉన్నాయి కానీ ద‌ళిత‌వాదాన్ని అర్థం చేసుకోవ‌డంలో వెనుకంజ‌లో ఉన్నాయి.కేసీఆర్ మాత్రం ద‌ళిత వాదాన్ని అర్థం చేసుకుంటున్నారు కానీ వారికి జ‌గ‌న్ మాదిరిగానే డ‌బ్బులు పంచుతున్నారు ఇదొక్క‌టే ప్ర‌ధాన లోపం. ఓ విధంగా ఎస్సీ కార్పొరేష‌న్ ఫండ్స్ నే ఈ విధంగా ద‌ళిత బంధు పేరిట పంచినా కూడా ల‌బ్ధిదారులకు వ‌చ్చిన కొత్త లాభం పెద్ద‌గా ఏమీ ఉండదు.

గ‌తంలోనూ ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లు విలువ చేసే యూనిట్లకు లోన్లు ఇచ్చిన దాఖ‌లాలు ఉన్నాయి. అటు ఆంధ్రాలోనూ చంద్ర‌బాబు హ‌యాంలో ఇలాంటి యూనిట్లు ఇన్నోవా కార్లు, టాటా సుమోలు రుణాల పేరిట ఇచ్చిన దాఖ‌లాలు ఉన్నాయి. కేసీఆర్ ఏంటంటే తానొక్క‌డే ఈ ప‌థ‌కం ఇచ్చిన విధంగా బిల్డ‌ప్పులు ఇస్తున్నారు అని విప‌క్షం విమ‌ర్శ‌లు చేస్తోంది. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ కేసీఆర్ కు మంచి భాష తెలుసు క‌నుక స్థానిక మాండలికంలో మాట్లాడి మోడీ క‌న్నా రాహుల్ క‌న్నా ద‌ళిత వాదం వినిపించ‌డంలో ముందున్నారు.రాహుల్ చాలా వెనుకంజలో ఉన్నారు.మోడీ మాత్రం అర్థం అయినా కూడా వాళ్ల కోసం తానేం చేస్తానో చెప్ప‌కుండా త‌ప్పుకుంటున్నారు అన్న‌ది ఇవాళ‌ రాజ‌కీయ విశ్లేష‌కుల వాద‌న.