Begin typing your search above and press return to search.

గవర్నరుకు అదీ పాయె...

By:  Tupaki Desk   |   12 Sept 2015 11:05 AM IST
గవర్నరుకు అదీ పాయె...
X
తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నరు అధికారాలను లాగేసుకోవడంలో మరో స్టెప్టు వేశారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో గవర్నరుకు అధికారాలున్నా ఆయన నామమాత్రమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఇంకో విషయంలోనూ గవర్నరుకున్న గుర్తింపును లేకుండా చేసింది తెలంగాణ ప్రబుత్వం.

గవర్నరుకు విశ్వవిద్యాలయాల్లో కీలక బాధ్యత ఉంటుంది... యూనివర్సిటీలకు ఆయనే కులపతిగా ఉంటారు... కానీ కొద్దికాలం కిందటే తెలంగాణలో విశ్వ విద్యాలయాలకు కులపతులను (చాన్స్‌ లర్‌) నియమించే అధికారం ప్రభుత్వానికే ఉందని కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా విశ్వ విద్యాలయాల చట్టాన్ని సవరిస్తూ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్‌ ఆచార్య తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుంచి ప్రభుత్వమే కులపతులను నియమిస్తుందని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఉప కులపతుల ఎంపికపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అన్వేషణ కమిటీలను ఏర్పాటు చేసి ఆ కమిటీలు ముగ్గురు పేర్లతో కూడిన ప్యానల్‌ను ప్రభుత్వానికి పంపిస్తుంది. అందులో ప్రభుత్వం సిఫారసు చేసిన పేర్లను వరుస క్రమంలో తుది ఆమోదం కోసం ఛాన్స్‌ లర్‌ కు పంపుతుంది. ముఖ్యమంత్రి ఈ ముగ్గురి పేర్లలో ఒక పేరును ఖరారు చేసి ఆ పేరును తోలివరుసలో ఉంచుతారు. ఛాన్స్‌ లర్‌ కూడా మొదటి పేరుకే ఆమోద ముద్ర వేస్తారు. ఆ తర్వాత ఇందుకు సంబందించిన ఉత్తర్వులు ఉన్నత విద్యాశాఖ వెలువరిస్తుంది.

అయితే.... కులపతిగా గవర్నర్‌ కాకుండా మరొకరిని నియమిస్తే కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలోని విశ్వ విద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) ద్వారా విశ్వ విద్యాలయాలకు నిధులు రావడం కష్టసాధ్యమని అధికారులు చెప్పినప్పటికీ సీఎం కేసీఆర్‌ మాత్రం కులపతి ఎంపికలో ప్రభుత్వందే తుది నిర్ణయమని, అవసరమైతే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదిస్తానని చెప్పారు. కులపతిగా గవర్నరే ఉండాలని ఎక్కడా నిబందనలు లేవని, ఆదేశాలు అంతకన్నా లేవని అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆయా విశ్వవిద్యా లయాలకు కులపతులను నియమించుకోవచ్చని కేసీఆర్‌ పలుమార్లు స్పష్టం చేశారు. ఆయన గతంలో ప్రకటించినట్లే రాష్ట్రంలో విశ్వ విద్యాలయాలకు ఇక నుంచి ప్రభుత్వమే కులపతులను నియమిస్తోందని తాజా ఉత్తర్వులను బట్టి తెలుస్తోంది.