Begin typing your search above and press return to search.
కోవర్ట్ ఆపరేషన్.. కాంగ్రెస్ పై కేసీఆర్ ప్రయోగం
By: Tupaki Desk | 13 Oct 2018 11:07 AM GMTఒకనొక పెద్ద సభ కానీ, సమావేశంలో భారీగా పంచ్ డైలాగులు పేల్చడం.. అనంతరం సైలెంట్ అయిపోయి తన ఫాంహౌస్ లోని వార్ రూంలో రాజకీయ వ్యూహాలు రచించడం కేసీఆర్ కు అలవాటు.. ఇలా కేసీఆర్ సైలెంట్ గా ఉన్నాడంటే.. ప్రతిపక్షాల కొంపలు మునుగుతున్నట్టే లెక్కా.. ఇప్పుడూ అదే ‘వ్యూహాత్మక మౌనం’ పాటిస్తున్నారు. దీనివెనుక పెద్ద స్కెచ్చే ఉందంటున్నారు.
మహాకూటమి సీట్ల సర్దుబాటు మరో రెండు రోజుల్లో తేలబోతోంది. కాంగ్రెస్ లోని పలువురు సీనియర్ నేతల సీట్లు పొత్తుల్లో టీడీపీ, సీపీఐ, టీజేఎస్ కు పోతున్నాయి. ఈ నేపథ్యంలో వారంతా అసమ్మతి గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నారట.. వారందరిలో కొంతమంది పోటీకి కూడా సై అంటున్నారట..కానీ కాంగ్రెస్ లోని అసమ్మతి వాదులను చేరదీయాలని కేసీఆర్ స్కెచ్ గీసినట్టు సమాచారం.
అయితే కాంగ్రెస్ అసమ్మతులను టీఆర్ఎస్ లో చేర్చుకోవడం లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు అసమ్మతులు చేరడం వల్ల ఇటు వైపు పడదు. అందుకే ఆ అసమ్మతులతోనే కాంగ్రెస్ సీట్లు పొందిన వారిని ఓడించేలా ‘కోవర్టు ఆపరేషన్’కు కేసీఆర్ తెరతీసినట్టు విశ్వసనీయ సమాచారం.
మహాకూటమి పొత్తుల్లో సీట్లు దక్కని కాంగ్రెస్ నేతలతో వ్యూహాత్మక చర్చలు జరిపాలని కేసీఆర్ జిల్లాల మంత్రులకు ఆదేశించినట్టు తెలిసింది. అసంతృప్తులకు టీఆర్ఎస్ గెలిచాక పదవులు, ఎమ్మెల్సీ , నామినేటెడ్ ఆశచూపాలని.. నమ్మకం కలుగకపోతే ‘భారీ బహుమానం’ కూడా ముట్టిజెప్పి కాంగ్రెస్ కోవర్టులుగా తీర్చిదిద్దాలని కేసీఆర్ ప్లాన్ చేసినట్టు తెలిసింది. నిలబడ్డ మహాకూటమి అభ్యర్థి ఓటమే లక్ష్యంగా ఈ కాంగ్రెస్ కోవర్టులు పనిచేయాలని కేసీఆర్ దిశానిర్ధేశం చేసినట్టు తెలిసింది. టీఆర్ఎస్ గెలవగానే ఈ కాంగ్రెస్ కోవర్టులను టీఆర్ఎస్ లో చేర్చుకొని పదవులు, వైగారా ఇవ్వాలని ప్లాన్ చేసినట్టు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ తాజాగా నిర్ణయించిన 40 సీట్లలో టికెట్లు రాని నేతలు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. వారిని గుర్తించి కోవర్టులుగా మార్చేందుకు టీఆర్ఎస్ రంగం సిద్ధం చేసిందట.. ఈ ప్లాన్ తో కాంగ్రెస్ తో పాటు మహాకూటమిని దెబ్బకొట్టాలని కేసీఆర్ స్కెచ్ గీసినట్టు సమాచారం.