Begin typing your search above and press return to search.
సొంత నేతల ఆరోగ్యంతో ఆడుకుంటున్న కేసీఆర్?
By: Tupaki Desk | 27 April 2021 4:51 AM GMTసీత కస్టాలు సీతవి.. పీత కష్టాలు పీతవని ఊరికే అనలేదేమో? అంతా బాగున్నట్లు చెబుతున్నప్పటికీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. మంత్రుల్లో కొందరి పరిస్థితి మహా దారుణంగా ఉందని చెబుతున్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలుత.. ఈ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ కీలకంగా వ్యవహరించి.. తిరుగులేని అధిక్యతను ప్రదర్శించాలని భావించారు. అనూహ్యంగా ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలటంతో.. తనకు సన్నిహితులైన మంత్రులు.. ఎమ్మెల్యేలకు మున్సిపల్ ఎన్నికల బాధ్యతల్ని అప్పజెప్పారు.
సీఎం కేసీఆర్ సైతం ఆదేశాలు ఇవ్వటం.. వ్యక్తిగతంగా ఇచ్చిన టాస్కుల్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కొందరు నేతలు.. ఇప్పుడు తమ ఫోకస్ అంతా మున్సిపల్ ఎన్నికల మీదనే పెడుతున్నారు. కరోనా కేసుల వ్యాప్తి భారీ ఎత్తున సాగుతున్నా.. నిండా మునిగినోడికి చలేమిటన్న ఆలోచనలో ఉన్న గులాబీ నేతలు.. పార్టీ గెలుపు కోసం చెమటలు చిందిస్తున్నారు. మండే ఎండలో వారు పడుతున్న శ్రమ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
మరోవైపు విపక్షాలు ఇప్పటికే చేష్టలుడిగినట్లుగా ఉన్న వేళ.. ఏ మాత్రం కష్టపడినా ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందన్న భావన గులాబీ నేతల్లో ఉంది. అందుకే.. కరోనా భయాన్ని పక్కన పెట్టి.. చెమటోడ్చి మరీ శ్రమిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావటానికి ఒక రోజు మాత్రమే ఉండటంతో.. ఈరోజు వరకు జాగ్రత్తగా గడిపితే చాలు.. క్షేమంగా బయటపడిపోతామన్న భావనలో ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల పేరుతో అధినేత తమ ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారన్న ఆరోపణలు కొందరి నోటి నుంచి వినిపస్తున్నాయి. అయితే.. ఎన్నికల వేళ.. ఆ మాత్రం రిస్కు తీసుకోకుంటే ఏం బాగుంటుందన్న మాటను చెబుతున్న నేతలు లేకపోలేదు. మొత్తం.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా.. మున్సిపల్ ఎన్నికల బాధ్యత నుంచిరిలీవ్ అయితే చాలు భగవంతుడా? అని ప్రార్థిస్తున్న వారే ఎక్కువని చెప్పక తప్పదు.