Begin typing your search above and press return to search.

కిష‌న్ రెడ్డి జోకులు వినండి కేసీఆర్ !

By:  Tupaki Desk   |   18 Feb 2022 5:30 AM GMT
కిష‌న్ రెడ్డి జోకులు వినండి కేసీఆర్ !
X
అన్ని రాష్ట్రాల‌నూ స‌మానంగా చూస్తున్నామ‌ని అంటున్నారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి. వినేందుకు ఈ జోక్ చాలా బాగుంది కానీ ఇందులో ఏదీ న‌మ్మ‌శ‌క్యంగా లేదు అన్న‌ది మాత్రం వాస్త‌వం.

నిన్న‌టి వేళ విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన కిష‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అర‌వై వేల కోట్ల‌తో ఈశాన్య రాష్ట్రాల‌లో ర‌హ‌దారుల అనుసంధాన కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతున్నామ‌ని అదే విధంగా ఇత‌ర ప్రాంతాలో కూడా జాతీయ ర‌హ‌దారుల అభివృద్ధే ప్ర‌ధాన సూత్రంగా ప‌నిచేస్తున్నామ‌ని అన్నారు.తెలంగాణ‌లో 33 జిల్లాలు ఉంటే 32 జిల్లాల‌కు జాతీయ ర‌హ‌దారుల అనుసంధాన‌త ఏర్ప‌డింది అని అన్నారు.

ఇదే విధంగా ఆంధ్రావ‌ని వాకిట ప‌దివేల కోట్ల రూపాల‌కు పైగా జాతీయ ర‌హ‌దారుల ప‌నులకు శ్రీ‌కారం దిద్దామ‌ని చెబుతున్నారు. ఇవ‌న్నీ బాగున్నాయి కానీ ఇదే స‌మ‌యంలో జాతీయ ర‌హ‌దారుల‌తో పాటు గ్రామీణ ర‌హ‌దారుల అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇస్తే మంచి ఫ‌లితాలు ద‌క్కేందుకు అవ‌కాశాలు ఉంటాయి.

కానీ ఆ దిశ‌గా కేంద్రం చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు. నాబార్డు రుణాలు రోడ్ల అభివృద్ధికి ఇచ్చేందుకు అవ‌కాశం ఉన్నా రాష్ట్రం ఇవ్వాల్సిన 40 శాతం వాటా ముందు చెల్లించ‌నిదే ప‌నులు చేప‌ట్టేందుకు నిధులు ఇవ్వ‌లేమ‌న్న మెలిక ఒక‌టి పెడుతోంది.

ఇక ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు సైతం రుణాల మంజూరుపై కూడా కేంద్రం పెద్ద‌గా చొర‌వ చూప‌డం లేదు.

ఉత్త‌రాదికి ద‌క్కే నిధులు ఉత్త‌రాంధ్ర‌కు ద‌క్క‌వు అన్న‌ది వాస్త‌వం. మ‌రి! కేంద్రం దృష్టిలో అంతా సమానం స‌ర్వం స‌మానం అని కిష‌న్ రెడ్డి చెప్ప‌డం అంటే హాస్యాస్ప‌దం కాక ఇంకేంట‌ట‌!